రంగంలోకి సీఎం జగన్.. ఆ ఇద్దరు అధికారులకు క్లీన్ చిట్..?

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో జగన్ సర్కారుకు అండగా పని చేసిన అధికారులపై ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని.. నిమ్మగడ్డ రమేశ్ బాబు ‘అభిశంసన’ అస్త్రం ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ సమయంలో తన నిర్ణయమే.. ఫైనల్ అన్నట్లుగా.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. అధికారులపై వరుసగా కొరఢా ఝులిపిస్తున్నారు. దీంతో వారు ఒకింత ఆందోళనకు గురవుతుండగా.. ప్రస్తుతం కోడ్ నేపథ్యంలో నిమ్మగడ్డ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు […]

Written By: NARESH, Updated On : January 27, 2021 9:02 pm
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో జగన్ సర్కారుకు అండగా పని చేసిన అధికారులపై ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని.. నిమ్మగడ్డ రమేశ్ బాబు ‘అభిశంసన’ అస్త్రం ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ సమయంలో తన నిర్ణయమే.. ఫైనల్ అన్నట్లుగా.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. అధికారులపై వరుసగా కొరఢా ఝులిపిస్తున్నారు. దీంతో వారు ఒకింత ఆందోళనకు గురవుతుండగా.. ప్రస్తుతం కోడ్ నేపథ్యంలో నిమ్మగడ్డ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు ముగిసిన తరువాత తమను కాపాడుతానని జగన్ సర్కారు హామీ ఇస్తోంది. ఇది అధికారులకు కొంత ఊరట కలిగిస్తున్న అంశమని అంటున్నారు. అయితే ఎస్ఈసీ చర్యలు తీసుకున్నాక వాటిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని అధికారవర్గాలు అంటున్నాయి.

రాష్ర్టంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని తెలిసీ.. ఓటర్ల జాబితాను తయారు చేసి ఎన్నికల సంఘాలని ఇవ్వాల్సింది పోయి.. జగన్ సర్కారు అండతో బిజినెస్ రూల్స్ ను కూడా ధిక్కరిచారన్న అభియోగంతో పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు గోపాల కృష్ణ త్రివేది.. గిరిజా శంకర్ పై ఎస్ఈసీ వేటుకు సిద్ధం అవుతున్నారు. నోటిఫికేషన్ సమయంలో.. రాష్ట్రంలో 3.6 లక్షల మంది ఓటుహక్కు ఉండి కోల్పోతున్నారన్న భావనతో సుప్రీం కోర్టు తీర్పు రాగానే వీరిపై వేటు చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ అంటున్నారు. కేవలం బదిలీతో సరిపెట్టకుండా.. రాష్ట్రస్థాయిలో అరుదుగా వాడే.. అభిశంసన ద్వారా వీరిద్దరి సర్వీసు రికార్డుల్లో బ్లాక్ మార్క్ వేసేశారు. దీంతో వీరి కెరియర్ కు ఇదో మచ్చలా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న అభిశంసన నిర్ణయంతో ఇద్దరు ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేది, గిరిజా శంకర్లపై బ్లాక్ మార్క్ పడే అవకాశం ఉంది. అంతేకాదు… వీరు భవిష్యత్ లో కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లాలన్నా.. ప్రమోషన్లు పొందాలన్నా.. ఇబ్బందులు తప్పేలా లేవు. కేంద్రానికి డిప్యూటేషన్ పై వెళ్లడానికి ఏడాది పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రమోషన్లు రావడం కూడా కష్టమే.. ఇంకా వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే చాలా వరకు ప్రయోజనాలు దక్కవు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మచ్చను తొలగిస్తే తప్పా.. వీరికి యథావిధి డిప్యూటేషన్లు , ప్రయోజనాలు లభించవు.

అయితే… ఈ ఇద్దరు అధికారులకు మేమున్నామంటూ.. జగన్ సర్కారు అభయం ఇస్తోంది. ఏ అధికారికి అన్యాయం జరగనివ్వమోమని సీఎం జగన్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. వారి విశ్వసనీయత.. ఆత్మస్థయిర్యాన్ని.. కాపాడతామన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక.. రమేశ్ కుమార్ తో ఓ సారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని.. వీలైతే.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని.. అధికారులకు అన్యాయం జరగనివ్వనని వారికి జగన్ ప్రభుత్వం భరోనా ఇచ్చినట్టు తెలిసింది..