https://oktelugu.com/

టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లకు శుభవార్త.. నేవీలో ఉద్యోగాలు..?

ఇండియ‌న్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. స్పోర్ట్స్ కోటా ద్వారా వేర్వేరు పోస్టుల భర్తీ కోసం దరఖస్తులను కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 7వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2021 / 07:14 PM IST
    Follow us on

    ఇండియ‌న్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. స్పోర్ట్స్ కోటా ద్వారా వేర్వేరు పోస్టుల భర్తీ కోసం దరఖస్తులను కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 7వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..?

    https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌ (ఎస్ఎస్ఆర్‌), మెట్రిక్‌ రిక్రూట్స్‌ (ఎంఆర్‌) ఉద్యోగాల భర్తీ జరగనుంది. డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై అంత‌ర్జాతీయ లేదా జాతీయ లేదా రాష్ట్ర స్థాయి సీనియ‌ర్ లేదా జూనియర్ టీమ్ గేమ్స్ లో పాల్గొన్న వారు అర్హులు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ పశుపాలన్‌ లో ఉద్యోగాలు..?

    17 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీస‌ర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌ (ఎస్ఎస్ఆర్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. అంతర్జాతీయ లేదా జాతీయ లేదా రాష్ట్రస్థాయి లేదా యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించే ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ టోర్న‌మెంట్ల‌లో పాల్గొన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    మెట్రిక్‌ రిక్రూట్స్‌ (ఎంఆర్)‌ ఉద్యోగాలకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అంత‌ర్జాతీయ లేదా జాతీయ లేదా రాష్ట్ర స్థాయి టోర్న‌మెంట్ల‌లో పాల్గొన్న వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఎస్ఎస్ఆర్, ఎంఆర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.