Clarifications Given To CAG On Rs 48K Cr: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48వేల కోట్లు.. ఏపీ ప్రజలు కష్టపడి కట్టిన పన్నుల సొమ్ము అదీ.. పైసా పైసా లెక్క చెప్పాల్సిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు లెక్కతప్పింది. ఏవేవో వ్యయాల రూపంలో 48వేల కోట్లు ఖర్చు చేసేసింది. తాజాగా అడ్డంగా దొరికిపోయింది. పదో ఇరవై కోట్లో కాదు.. 48వేల కోట్లు.. కాగ్ కడిగేయడంతో ఇప్పుడీ వ్యవహారం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
‘కాగ్’ లెక్కలు బయటకొచ్చాయి. అధికార వైసీపీ 48వేల కోట్ల దుర్వినియోగం లెక్కతేలింది. గత చంద్రబాబు ప్రభుత్వం సుద్దపూస అంటే అదీ కాదని తేల్చింది.. భారీగా అప్పులు చేసిందని ఆరోపించింది. అప్పులు ఏపీ సర్కార్ నెత్తిన బండలా పెట్టిందన్నది. ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ తాజా రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ‘కాగ్’ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏకంగా రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలో శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పక్కనపెట్టిందని తీవ్ర ఆరోపణలు చేసింది. కాగ్ నివేదికలో ప్రభుత్వం స్థూల ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని.. నిధులు దుర్వినియోగం చేసిందని.. ఇందులో అనుమతి లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పేర్కొంది.
Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?
ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ అందిపుచ్చుకుంది. కాగ్ ఎత్తిచూపిన అక్రమాలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని.. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
-కాగ్ కడిగేసిన లెక్కలివీ
2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బడ్జెట్ 1,10,509.12 కోట్లు. అయితే దీనికి మించి అదనపు చెల్లింపులు జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని 204, 205 అధికరణలను ఉల్లంఘించడమేనని.. దీని ప్రకారం ‘రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా చేసిన కేటాయింపులు మినహాయించి ‘కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా చేశారని కాగ్ ఎండగట్టింది. ఇది బడ్జెట్, ఆర్థిక నియంత్రణ వ్యవస్థకు విఘాతం కలిగిందని.. ప్రజా వనరుల నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించారని కాగ్ తీవ్ర వ్యాక్యలు చేసింది.
కొన్ని విలువైన లావాదేవీలను ఏపీ ప్రభుత్వం చేసిందని కాగ్ ఆరోపించింది. ‘ప్రత్యేక బిల్లుల’ పేరిట ఏకంగా రూ.48284 కోట్లకు సరైన లెక్కలు లేవని బాంబుపేల్చింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) తన అధికారాలను అధిగమించి ఈ బ్యాంకు లావాదేవీలను ఆమోదించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక బిల్లు నిర్వహణ అనేది అనధికారికంగా జరిగిందని తేల్చింది. 26,839 కోట్ల విలువైన లావాదేవీలు ఐదు కేటగిరిలుగా విభజించి ట్రెజరీ కోడ్ నిబంధలనకు విరుద్ధంగా పంచారని కాగ్ గుర్తించడం గమనార్హం.
ఇక అకౌంటింగ్ కూడా తప్పుల తడకగా.. వ్యయాన్ని పెంచే విధంగా ఉందని కాగ్ నిగ్గు తేల్చింది. ఖచ్చితంగా ఇన్ని వేల కోట్లు ఏపీ ప్రభుత్వంలో దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది.
మార్చి 2021 వరకూ ఏపీ ప్రభుత్వ రుణాలు రూ.86259.82 కోట్లకు చేరాయి. ప్రభుత్వం మొత్తం హామీల విలువ రూ.116330 కోట్లుగా ఉంది. దీంతో అప్పులకే 70 శాతం పోతే ఇక హామీలు ఎలా అమలు చేస్తారని కాగ్ ప్రశ్నించింది.
ఇక కాగ్ లేవనెత్తిన ఆ 48వేల కోట్ల లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది.
ఇక అతిపెద్ద కుంభకోణాన్ని ఏపీ ఆర్థిక మంత్రి ఖండించారు. సీఎఫ్ఎంఎస్ లో ప్రత్యేక బిల్లులు లేవని.. సర్దుబాటు లావాదేవీలను గుర్తించడానికి, ప్రత్యేక బిల్లుల పేరు ఉపయోగించామని క్లారిటీ ఇచ్చారు. అయితే టీడీపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం 48వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.మరి ఈ 48వేల కోట్ల అవినీతి కథ ఏపీ ప్రభుత్వాన్ని ఏం చేస్తుందన్నది వేచిచూడాలి. స్వయంగా కాగ్ బయటపెట్టడంతో ఇప్పుడది దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
Also Read: Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Clarifications given to cag on rs 48k cr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com