
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరోలను పట్టుకోవడంలో ఆరితేరిపోయాడు. ముఖ్యంగా స్టార్ హీరోలందరితో త్రివిక్రమ్ కి మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ తో అందరూ మంచిగానే ఉంటారు. పైగా త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్.. విషయం ఎక్కువ ఉన్న రచయిత. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే.. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు లాంటి హీరో కూడా పైరవీలు చేయాల్సి వస్తోంది. మరి ఇంత డిమాండ్ ఉన్న త్రివిక్రమ్ తో సినిమాని ఎందుకు ఎన్టీఆర్ వద్దు అనుకున్నాడు.
నిజానికి ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కి మధ్య ‘అరవింద సమేత’ సినిమా విషయంలోనే ఒక మంచి అనుబంధం ఏర్పడినట్లు అనిపించింది. ‘అరవింద సమేత’ సినిమా విడుదలకు కొద్ధి రోజుల ముందు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. పైగా కుటుంబ పరంగా కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీతో కూడా త్రివిక్రమ్ కి మంచి బాండింగ్ ఏర్పడింది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ అరవింద సమేత సక్సెస్ మీట్ లో స్టేజ్ మీదే వివరంగా చెప్పారు. త్రివిక్రమ్ తనకు దేవుడి ఇచ్చిన సన్నిహితుడు అని, తన కుటుంబ సభ్యలతో కూడా ఆయనకు ఎంతో రిలేషన్ ఉందని ఇలా చాలానే చెప్పాడు తారక్. అలాగే, ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత తనతో సినిమా చేసిన ఎన్టీఆర్ అంటే అంతే ఆప్యాయతని కనబర్చాడు త్రివిక్రమ్.
అలాంటి మంచి సన్నిహితులు అయినా వీరిద్దరు ఒక సినిమాని ఎనౌన్స్ చేశారు. తీరా షూటింగ్ కి వెళ్లాల్సిన టైంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో వీరి సినిమా ఆగిపోయింది. మరి వీరి కాంబినేషన్లో భవిష్యత్తులోనైనా సినిమా వస్తోందా అని చూడాలి.