Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda and Charmi: ఛార్మీ క్లారిటీతో విజయ్ దేవరకొండ ఫుల్...

Vijay Deverakonda and Charmi: ఛార్మీ క్లారిటీతో విజయ్ దేవరకొండ ఫుల్ చిల్ !

Vijay Deverakonda and Charmi: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘లైగర్’ సినిమా షూటింగ్ ను ఈ వారంలో గోవాలో ప్లాన్ చేశారు. అయితే, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉందని, కాబట్టి ఈ భయానిక నేపథ్యంలో లైగర్ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయక తప్పలేదు అని, అందుకే కొన్ని రోజులు షూటింగ్ ను వాయిదా వేశామని చిత్ర నిర్మాత ఛార్మీ ట్విట్టర్‌ లో అధికారికంగా తెలిపింది.

Vijay Deverakonda and Charmi
Vijay Deverakonda and Charmi

ఛార్మీ మాటల్లోనే.. ‘కొవిడ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. ఇలాంటి సమయంలో మా టీం కాస్ట్ అండ్ క్రూని రిస్క్‌ లో పెట్టడం మంచిది కాదు అని నిర్ణయించుకున్నాం. అందుకే, ఎవరూ కరోనా కోరల్లో చిక్కకూడదు అని లైగర్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండండి’ అంటూ ఛార్మీ ట్వీట్ చేసింది.

మరోవైపు తమ సినిమా షూటింగ్ లేకపోవడంతో తాను ఇంట్లోనే ఫుల్ చిల్ అవుతున్నట్లు విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేశాడు. ఇక గోవాలో ప్లాన్ చేసిన ఈ సినిమా షెడ్యూల్ లో మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో షూట్ చేయాలనుకున్నారు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడు.

Also Read: నట రాక్షసుడితో క్లైమాక్స్.. స్టన్నింగ్ !

పైగా ఇప్పుడు గోవాలో ప్లాన్ చేసిన ఫైట్ కూడా, మొత్తం సినిమా కథనే మలుపు తిప్పుతుందని, అలాగే కీలకమైన ఎమోషనల్ సన్నివేశం అని తెలుస్తోంది. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.

మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ న్యూ ఇయర్ కానుకగా వచ్చి ఇండియన్ రికార్డులను తుడిచి పెట్టిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ పేరు మీదున్న 8.49 మిలియన్ వ్యూస్ రికార్డును కేవలం 7 గంటల్లోనే ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ తుడిచిపెట్టింది. అసలు ‘లైగర్’ సినిమా పై ఇంత క్రేజ్ ఉందా అంటూ నెటిజన్లు కూడా షాక్ అయ్యారు.

Also Read: టాలీవుడ్ టార్గెట్ ఇప్పుడు అదే.. ఏమవుతుందో ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version