https://oktelugu.com/

Jeevita Rajasekhar: ఆ రోజులను తలుచుకొని కన్నీరుపెట్టిన జీవితా రాజశేఖర్..(వీడియో)..!

Jeevita Rajasekhar: టాలీవుడ్ బెస్ట్ కపూల్స్ లిస్టులో హీరో రాజశేఖర్, జీవితలు ముందు వరుసలో నిలుస్తారు. సినీ కెరీర్ ను ఒకే సమయంలో ప్రారంభించిన వీరిద్దరు పలు సినిమాల్లో కలిసి నటించారు. ‘ఆహుతి’, ‘తాలంబ్రాలు’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి ఖాతాలో ఉన్నాయి.  అలాఅలా ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకొని వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. వీరి అనోన్య దంపత్యానికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. తాజాగా రాజశేఖర్, జీవిత దంపతులు ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 7, 2022 / 06:45 PM IST
    Follow us on

    Jeevita Rajasekhar: టాలీవుడ్ బెస్ట్ కపూల్స్ లిస్టులో హీరో రాజశేఖర్, జీవితలు ముందు వరుసలో నిలుస్తారు. సినీ కెరీర్ ను ఒకే సమయంలో ప్రారంభించిన వీరిద్దరు పలు సినిమాల్లో కలిసి నటించారు. ‘ఆహుతి’, ‘తాలంబ్రాలు’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి ఖాతాలో ఉన్నాయి.  అలాఅలా ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకొని వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. వీరి అనోన్య దంపత్యానికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

    Jeevitha Rajasekhar

    తాజాగా రాజశేఖర్, జీవిత దంపతులు ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదా’ గేమ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామెడీయన్ అలీ పలు ఆసక్తికరమైన ప్రశ్నలను జీవిత రాజశేఖర్ లను అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరు ఎలా కలుసుకున్నారు? సినిమా కెరీర్, వివాహం, పిల్లలు, భార్యాభర్తల విబేధాలు తదితర ప్రశ్నలన్నింటిని సరదాగా అడిగి సమాధానాలను రాబట్టాడు.

    అలీ ప్రశ్నలకు జీవిత, రాజశేఖర్ దంపతులు సమాధానం ఇస్తున్న క్రమంలోనే ఒకచోట ఎమోషన్ అయ్యారు. రాజశేఖర్ కు కోవిడ్ సోకిన సమయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు తమ కుటుంబం గురైందో తలుచుకొని జీవిత కన్నీటి పర్యాంతమైంది. రాజశేఖర్ సైతం తాను నెలరోజుల పాటు ఐసీయూలో ఉండటాన్ని గుర్తు చేసుకుంటూ మరో రెండ్రోజుల్లో తాను చనిపోతానని, నా బాడీని తీసుకెళ్లి మంట పెడుతారనే ఆలోచనతో ఉన్నానని బాధపడ్డారు.

    ఇక మీ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయా? అని ప్రశ్నంచగా దానికి రాజశేఖర్ ‘ఎలాంటి భార్య లభిస్తుందన్నది దేవుడిచ్చిన వరం’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే జీవిత బయట ఫైర్ బ్రాండ్ అని అలీ అనగా ఇంట్లో మాత్రం తుస్సేనంటూ చెప్పడం నవ్వులు పూయించింది. ఇదిలా ఉంటే జీవిత డైరెక్షన్లో రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ అని తెరకెక్కింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానున్నట్లు రాజశేఖర్ దంపతులు ఈ షోలో వెల్లడించారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.