Vijay Deverakonda and Charmi: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ‘లైగర్’ సినిమా షూటింగ్ ను ఈ వారంలో గోవాలో ప్లాన్ చేశారు. అయితే, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉందని, కాబట్టి ఈ భయానిక నేపథ్యంలో లైగర్ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయక తప్పలేదు అని, అందుకే కొన్ని రోజులు షూటింగ్ ను వాయిదా వేశామని చిత్ర నిర్మాత ఛార్మీ ట్విట్టర్ లో అధికారికంగా తెలిపింది.

ఛార్మీ మాటల్లోనే.. ‘కొవిడ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. ఇలాంటి సమయంలో మా టీం కాస్ట్ అండ్ క్రూని రిస్క్ లో పెట్టడం మంచిది కాదు అని నిర్ణయించుకున్నాం. అందుకే, ఎవరూ కరోనా కోరల్లో చిక్కకూడదు అని లైగర్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండండి’ అంటూ ఛార్మీ ట్వీట్ చేసింది.
మరోవైపు తమ సినిమా షూటింగ్ లేకపోవడంతో తాను ఇంట్లోనే ఫుల్ చిల్ అవుతున్నట్లు విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేశాడు. ఇక గోవాలో ప్లాన్ చేసిన ఈ సినిమా షెడ్యూల్ లో మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో షూట్ చేయాలనుకున్నారు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడు.
Also Read: నట రాక్షసుడితో క్లైమాక్స్.. స్టన్నింగ్ !
పైగా ఇప్పుడు గోవాలో ప్లాన్ చేసిన ఫైట్ కూడా, మొత్తం సినిమా కథనే మలుపు తిప్పుతుందని, అలాగే కీలకమైన ఎమోషనల్ సన్నివేశం అని తెలుస్తోంది. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.
మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ‘లైగర్’ సినిమా గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా వచ్చి ఇండియన్ రికార్డులను తుడిచి పెట్టిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ పేరు మీదున్న 8.49 మిలియన్ వ్యూస్ రికార్డును కేవలం 7 గంటల్లోనే ‘లైగర్’ సినిమా గ్లింప్స్ తుడిచిపెట్టింది. అసలు ‘లైగర్’ సినిమా పై ఇంత క్రేజ్ ఉందా అంటూ నెటిజన్లు కూడా షాక్ అయ్యారు.
Also Read: టాలీవుడ్ టార్గెట్ ఇప్పుడు అదే.. ఏమవుతుందో ?
#Covid cases rising immensely and we did not want to risk our cast n crew’s health , hence #liger shoot has been cancelled..
hmmmm .
Stay safe stay home ❤️ https://t.co/7iRKegRnlM— Charmme Kaur (@Charmmeofficial) January 7, 2022