Modi Khalistan Video : పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీని 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయేలా చేసిన పంజాబ్ నిరసనకారుల చర్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటనకు అసాధారణమైన పోలికతో ఒక యానిమేషన్ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఏడాది క్రితం యానిమేటెడ్ క్లిప్‌లో చూపించిన దానికి, జనవరి 5న ఫ్లైఓవర్‌పై ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నప్పుడు జరిగిన దానికి సూట్ అయ్యేలా ఇది ఉండడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మోడీ భద్రతకు ప్రమాదం వాటిల్లింది. పాత వీడియోను నేటి ఘటనకు అన్వయిస్తూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ట్రక్కులు -ట్రాక్టర్లను ఉపయోగించి నిరసనకారులు ఈ వీడియోలో మోడీ వెంటాడి నిర్భదించి చంపడానికి రెడీ అయినట్టుగా వీడియో ఉంది. ఇదిప్పుడు పెనుదుమారాన్ని రేపుతోంది..

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ఈ వీడియోను షేర్ చేసి, 2020లో ఈ యానిమేటెడ్ వీడియోని రూపొందించారని.. తాజాగా పంజాబ్ లో మోడీకి భద్రతా వైఫల్యంతో 2022లో మళ్లీ వైరల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియోను ఖలిస్తానీ మద్దతుదారులు ఏడాది క్రితం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని ఆరోపించారు.
‘ఫిర్ దేఖాంగే – కిస్సాన్ ఏక్తా జిందాబాద్’ పేరుతో 3.02 నిమిషాల వీడియో ఢక్కా గేమింగ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా డిసెంబర్ 1, 2020న అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో నేపథ్యంలో ప్లే అయ్యే పాట పంజాబీ గాయకుడు సిము ధిల్లాన్ పాడిన ‘బాఘీ’ లోనిది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో రైతు నిరసన జరిగినప్పుడు ఈ వీడియోను రూపొందించారు. తాజాగా మోడీని పంజాబ్ లో 20 నిమిషాల పాటు నిర్బంధించినప్పుడు సదురు వీడియోను వైరల్ చేశారు.
వీడియో ప్రారంభంలో ప్రధాని మోడీ యానిమేషన్ పాత్ర అతని కాన్వాయ్ వద్దకు వస్తుంది. తుపాకీతో ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది అతనిని వెంబడించడం చూడవచ్చు. ప్రధాని మోదీ తన కారు ఎక్కి తన పరివారంతో వెళ్లిపోయారు. తర్వాత ఇది రాపర్.. గాయకుడు సిద్ధూ మూస్‌వాలాను పోలి ఉండే ఒక యానిమేటెడ్ పాత్రను చూపించింది. అతను గతంలో చాలాసార్లు ఖలిస్తానీ కథనంతో సానుభూతి చూపుతూ పాటలు వీడియోలు రూపొందించాడు. నీలిరంగు ట్రాక్టర్‌లో కూర్చుని పీఎం మోడీ కాన్వాయ్ వైపు వెళ్తున్నాడు. నీలిరంగు ట్రాక్టర్ లతోనే పంజాబ్ నిరసనకారులు ఆయనను అడ్డుకున్నారు. చివరకు ఫ్లై ఓవర్ పై అందరూ చుట్టుముట్టి మోడీని ఆయుధాలతో రౌండప్ చేసినట్టు చూపించాడు. మోడీని చంపడానికే ఇలా దిగ్బంధించినట్టుగా వీడియోలో ఉంది. ఈ ఖలిస్తాన్ మద్దతుదారుల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మోడీని అవమానించేలా చూపించిన ఈ వీడియో పెనుదుమారం రేపుతోంది.
వీడియో ఇదే
https://www.youtube.com/watch?v=ehohYZXkFII