spot_img
Homeసినిమా వార్తలుసినీ పరిశ్రమలో విషాదం.. న‌టుడు నాగ‌య్య మృతి

సినీ పరిశ్రమలో విషాదం.. న‌టుడు నాగ‌య్య మృతి

Nagaiah
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో విషాదం చోటు చేసుకుంది. న‌టుడు నాగ‌య్య ఇవాళ తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు. ‘వేదం’ సినిమాలో ఆయ‌న అద్భుత‌మైన‌ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దీంతో.. అప్పటి నుంచి అందరూ ఆయ‌నను ‘వేదం’నాగయ్యగా పిలుస్తున్నారు. వేదం సినిమా తర్వాత ఆయనకు ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వరకూ సుమారు 30 చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.

ఏపీలోని గుంటూరు జిల్లా న‌ర‌సారావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం ఆయ‌న స్వ‌గ్రామం. ఎప్పుడో ఇండస్ట్రీకి వ‌చ్చిన ఆయ‌న‌కు మొద‌ట్లో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆయ‌న మొద‌ట‌గా న‌టించింది వేదం సినిమాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. మొద‌టి చిత్రంతోనే గుర్తింపు ద‌క్క‌డంతో ఆ త‌ర్వాత ప‌లువురు అవ‌కాశాలిచ్చారు. ఆ విధంగా.. లీడ‌ర్‌, నాగ‌వ‌ల్లి, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, స్పైడ‌ర్‌, సీమ ట‌పాకాయ్ వంటి చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.

అయితే.. ఒక‌టీ రెండు నిమిషాల పాత్ర‌లు కూడా ఎప్పుడో ఒక‌టీ అరా రావ‌డంతో జీవ‌నం దుర్భ‌రంగా మారింది. పూట‌గ‌డ‌వ‌డం కూడా క‌ష్టంగా మారింది. ఈ మ‌ధ్యే నాగ‌య్య భార్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో.. ఆయ‌న మ‌రింత డీలా ప‌డిపోయారు. మాన‌సికంగా తీవ్రంగా కుంగిపోయారు.

ఈ ప‌రిస్థితుల్లోనే శ‌నివారం తెల్ల‌వారుజామున వేదం నాగ‌య్య ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతిప‌ట్ల ఇండ‌స్ట్రీలోని ప‌లువురు సంతాపం తెలుపుతున్నారు. ఇవాళ సాయ‌త్రం లేదా రేపు ఉద‌యం అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version