బిగ్ ప్లాప్ డైరెక్టర్ కి పవన్ ఛాన్స్.. కారణం అదే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విభిన్నమైనది. అలాగే పవన్ లోని సేవాగుణం కూడా ప్రత్యేకమైనది. అవసరంలో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే పవన్, ఇక తన మనుషులు అని అనుకున్నవాళ్లకు ఎంత చేస్తాడు. పైగా పవన్ కి ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారని, వారితో మళ్ళీ విడిపోవడం దాదాపు అసాధ్యమని పవన్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు. అది నిజమే అని మరోసారి రుజువు అయింది. తనతో సినిమా చేయడానికి […]

Written By: admin, Updated On : March 27, 2021 2:12 pm
Follow us on


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విభిన్నమైనది. అలాగే పవన్ లోని సేవాగుణం కూడా ప్రత్యేకమైనది. అవసరంలో ఉన్నవారికి అడగకుండానే సాయం చేసే పవన్, ఇక తన మనుషులు అని అనుకున్నవాళ్లకు ఎంత చేస్తాడు. పైగా పవన్ కి ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారని, వారితో మళ్ళీ విడిపోవడం దాదాపు అసాధ్యమని పవన్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు. అది నిజమే అని మరోసారి రుజువు అయింది.

తనతో సినిమా చేయడానికి చాలామంది స్టార్ దర్శకులు రెడీగా ఉన్నా, పవన్ మాత్రం ఒక ప్లాప్ డైరెక్టర్ కి సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమా ఇస్తోంది ఎదో గొప్ప కథ దొరికింది అని కాదు. ఆ ప్లాప్ డైరెక్టర్ తనను నమ్ముకున్న మనిషి అని. అందుకే పిలిచి మరీ సినిమా ఇస్తున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే.. మెహర్ రమేష్. దర్శకుడిగా మెహ‌ర్ రమేష్ ఎన్టీఆర్ ను రెండు సార్లు, ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు. అయినా అతని కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు.

దీనికితోడు మెహర్ రమేష్ తీసిన సినిమాలన్ని భారీ ప్లాప్ బడ్జెట్ సినిమాలే. అన్నిటికి మించి మెహర్ రమేష్ సినిమా తీసి ఇప్పటికే దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నా.. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళేవరకూ నమ్మకం లేదు. అసలు ఇలాంటి డైరెక్టర్ కి నిజంగా ఏ స్టార్ హీరో పిలిచి సినిమా ఇస్తాడు ? కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. కథ లేకపోయినా.. కేవలం తన మనిషి అనే ఒకే ఒక్క కోణంలో ఆలోచించి భారీ బడ్జెట్ సినిమా ఇచ్చాడు. నిజానికి మెహర్ కి హిట్ లేకపోవడంతో చిన్న హీరోలు కూడా ఎవ్వరూ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ పవన్ మాత్రం మెహర్ కి ఛాన్స్ ఇచ్చి.. అతని జీవితాన్ని నిలబెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. మరి చూడాలి మెహర్ ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో.