Homeసినిమా వార్తలుపవన్ ఒక వ్యసనం.. బండ్ల సంచలనం !

పవన్ ఒక వ్యసనం.. బండ్ల సంచలనం !

Bandla Ganesh Speech
పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కి అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా సరే.. వారందరికంటే కూడా తానే పవర్ ఫుల్ భక్తుడ్ని అని బలంగా చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. కాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వకీల్ ‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌ లో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ మొత్తానికి పవన్‌కళ్యాణ్ ‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి సగర్వంగా చాటుకున్నాడు.

బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ తన ప్రసంగమే పవన్ ను దేవుడితో పోలుస్తూ ప్రారంభించాడు. అయితే ఎప్పటిలాగే ఆవేశంగా మాట్లాడిన బండ్ల మొత్తానికి పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే.. చనిపోయి బూడిద అయ్యే వరకూ మనం వదల్లేం అంటూ ఓ భారీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. పైగా ఓ పిట్ట కథ కూడా చెబుతూ.. ‘ఓ ఐపీఎస్ వద్దకు వెళ్లి మీరు టెన్త్ క్లాస్‌ బాగా పాస్ అయ్యారు అన్నట్లు ఉంటుంది మా హీరోగారి మాట్లాడితే. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, చరిత్రలు లేవు. ఆయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. అంటూ బండ్ల చెబుతుంటే పవన్ కూడా తనలో తానూ నవ్వుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

అలాగే బండ్ల ఆ మధ్య తనకు ఎదురైన ఒక సంఘటన గురించి చెబుతూ.. ‘నన్ను ఒకడు మీ బాస్ ఎందిరా ఓసారి సినిమాలు, మరోసారి రాజకీయాలు అంటాడు అని అడిగాడు. నేను అతనితో చెప్పా.. ఆయనది మనలా కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం కాదు కదా.. ఆయన ఆయనకి ఉన్నదిల్లా బ్లెడ్ వ్యాపారం.. ఆయన రక్తాన్ని ఆయన నటనగా మార్చి దాన్ని జనానికి అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్. అని అప్పుడు చెప్పానని బండ్ల చెప్పుకున్నాడు. ఆలాగే పవన్ తో తన సాన్నిహిత్యం గురించి చెబుతూ ‘నేను చాలాసార్లు పవన్‌కళ్యాణ్‌కి అబద్ధం చెప్పి మోసం చేద్దామని అనుకున్నా. కానీ ఆయన కళ్లలో నిజాయితీ చూసిన వెంటనే అలా చేయడం నా వల్ల కాలేదు. అయన కళ్లలో అంత నిజాయతీ ఉంటుంది. వెంకన్నకు అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటున్నాను’’ అని మొత్తానికి ఓ సుదీర్ఘ స్పీచ్ ఇచ్చాడు బండ్ల.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular