Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroines: నేహా శర్మ నుంచి హెబ్బా పటేల్ దాకా.. ఆ తప్పు చేసి సినీ...

Tollywood Heroines: నేహా శర్మ నుంచి హెబ్బా పటేల్ దాకా.. ఆ తప్పు చేసి సినీ కెరీర్ కోల్పోయిన వారు వీరే..

Tollywood Heroines
Tollywood Heroine Hebah Patel

Tollywood Heroines: చిత్రసీమ రంగుల ప్రపంచం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఉన్నంత వరకే సర్వైవ్ అవుతుంటారన్న విషయాన్ని దాదాపుగా ఎవరూ కాదనలేరు. ఇకపోతే ఇక్కడ ఉండాలంటే సక్సెస్ అనేదే చాలా ముఖ్యంగా. అలా సక్సెస్ అవడంతో పాటు గ్లామర్ ఉంటే కనుక వారికి అవకాశాలు కలిసొస్తాయి. అయితే, అలా సక్సెస్ రావడానికి హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ ప్లే చేయడంతో పాటు స్టోరిలో కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడాలి. అలా స్టోరి సెలక్షన్ సరిగా చేసుకుంటేనే వారు కొంత కాలమైనా చిత్రసీమలో నిలబడుతారు. లేదంటే అక్కడే ఆగిపోతుంటారు. అలా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకోలేకపోయి కెరీర్ మధ్యలోనే ఆగిపోయిన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

Tollywood Heroines
Tollywood Heroine Neha Sharma

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ‘చిరుత’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.,. ఆ తర్వాత పత్త లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత ఈ భామ ‘కుర్రాడు’ అనే ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లేచేసింది. కాగా, ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక ఆ తర్వాత ఈ సుందరి కనబడకుండా పోయింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నువ్వునేను’లో నటించిన అనిత హంసనందిని.. ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో పొరపాట్లు చేయడం వలన తర్వాత కెరీర్ లో హీరోయిన్ గా నిలబడలేకపోయింది.

Tollywood Heroines
Nuvvu Nenu Movie Heroine

Also Read: Tollywood Heroines: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించార‌ట‌.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!

Tollywood Heroines
Tollywood Heroine Karthika

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇడియట్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రక్షిత.. ఆ పిక్చర్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ ఫిల్మ్ తర్వాత రక్షిత ‘ఆంధ్రావాలా, నిజం’ చిత్రాల్లో కథనాయికగా నటించింది. కానీ, పిక్చర్స్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో రక్షిత తర్వాత కనబడకుండా పోయింది. మరో ముద్దుగుమ్మ ఇషా చావ్లా..‘ప్రేమ కావాలి’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది.

Tollywood Heroines
Tollywood Heroine Rakshita

కుర్రకారు ఈ భామ గ్లామర్‌ను చూసి ఆమెనే ఫేవరెట్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే, ఈ సుందరి ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా వరుస ఫ్లాప్స్ కావడంతో తర్వాత హీరోయిన్ గా కనబడకుండా పోయింది. సీనియర్ హీరోయిన్ రాధా కూతురు కార్తీక.. నాగచైతన్య ‘జోష్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో ఈ భామ కోలీవుడ్ లో ‘రంగం’ ఫిల్మ్ చేసింది. అది సూపర్ హిట్ అయింది. అయితే, తెలుగులో తర్వాత కాలంలో ‘దమ్ము’ చిత్రం చేసింది. కానీ, అది డిజాస్టర్ కావడంతో ఇక ఈ సుందరి హీరోయిన్ గా మళ్లీ తెలుగు చిత్రాల్లో కనబడలేదు. అను ఇమ్మాన్యుయేల్, నందిత రాజ్, హెబ్బా పటేల్ కూడా అంతే..

Tollywood Heroines
Tollywood Heroine Isha Chawla

Also Read: Tollywood Heroines: భయంకర వ్యాధులతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్లే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

4 COMMENTS

  1. […] Netaji: ‘అజాద్ హింద్ ఫౌజ్’ అనే పోరాట సంస్థను స్థాపించి భారత దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించిన మన సమరయోధుడు ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’. బ్రిటీష్ ఉక్కు పిడికిలి నుంచి భారత్ ను విముక్తి చేసేందుకు దేశంలోని అతివాద యువకులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ బ్రిటన్ పై యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో ఈ పోరాటానికి మద్దతుగా నేతాజీ విరాళాల ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. దానికి భారీ స్పందన వచ్చింది. భారతీయ ప్రజలు, వ్యాపారాలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను నడిపించారు. […]

  2. […] Team India Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్ గా దిగిపోతూ తన తదుపరి వారసుడు కేఎల్ రాహుల్ అని.. అతడినే కొత్త కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లకు సూచించాడు. కానీ కోహ్లీ ప్రతిపాదనలను పక్కనపెట్టి వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్ ను చేశారు. కోహ్లీ కోపానికి ఇది కూడా ఒక కారణం. […]

  3. […] Guava Fruit Benefits: జామ పండులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే జామ ఆకులో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులతో పాటు జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే జామ పండు ఎక్కువగా తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జామ పండు తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం. […]

Comments are closed.

Exit mobile version