Bhimla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా తాజాగా నిర్మాతలు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
Bheemla Nayak
డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా చెప్పాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయితే, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటూ థమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
Also Read: నేహా శర్మ నుంచి హెబ్బా పటేల్ దాకా.. ఆ తప్పు చేసి సినీ కెరీర్ కోల్పోయిన వారు వీరే..
Bhimla Nayak
ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఇతర పాటలు కూడా మూడు ఉన్నాయి. అందుకే, కొన్ని సీన్స్ ను తీసేశారు. మొత్తానికి సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారట. అవసరం అనుకుంటే మరో పది నిమిషాల సినిమాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్.
Also Read: ‘కొండా’తో వచ్చిన వర్మ.. చివరి దశకి వచ్చిన ‘హను-మాన్’ !