Movie Time: ‘కొండా’తో వచ్చిన వర్మ.. చివరి దశకి వచ్చిన ‘హను-మాన్’ !

Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. కాగా ఈ రోజు హైదరాబాద్‌ లో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె.నాగార్జునరెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. గతంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘జాంబీరెడ్డి’ మంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : January 25, 2022 12:00 pm
Follow us on

Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. కాగా ఈ రోజు హైదరాబాద్‌ లో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె.నాగార్జునరెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. గతంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘జాంబీరెడ్డి’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Movie Time

మరో మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. రాంగోపాల్‌ వర్మ ‘కొండా’తో మళ్లీ ప్రేక్షకుల పై దాడి చేయబోతున్నాడు. కొండా మురళి, సురేఖ దంపతుల బయోపిక్‌తో రాబోతున్న కొండా సినిమాకు రాంగోపాల్‌ వర్మ తన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి.. తాజాగా ఒక వీడియో వదిలాడు. దీన్ని టీజర్‌ అనాలో, ట్రైలర్‌ అనాలో అర్ధం కాలేదు. ఇక వర్మ ఎప్పటిలాగే.. “కని విని ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారతారు. అలా ఓ అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి“ అంటూ కథలోకి చెప్పుకొచ్చాడు వర్మ.

Also Read: పవన్ నిర్ణయమే వాళ్లకు పెద్ద కండీషన్ !

 

Movie Time:

అన్నట్టు మరో సినీ అప్ డేట్ కి వస్తే.. హీరో విక్రమ్ తన తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘మహాన్’. గతంలోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో చివరికి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో ‘మహాన్’ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: ఆ స్టార్ హీరోయిన్ కి ఏ పార్టీ నచ్చలేదట !

Tags