
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత రిలీజ్ చేస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తోనే బాక్సులు బద్దలు కొట్టారు. రికార్డులు కొల్లగొట్టారు. ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ ను ప్రారంభించారు.
తాజాగా ‘వకీల్ సాబ్’ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని.. సినిమా సంగతులను మీడియాతో పంచుకున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఆ సినిమా ఫ్లాప్ తో దాదాపు ఏడేళ్లు ఇంటికే పరిమితమయ్యాడట.. సినిమా అవకాశాలు లేక నానా అగచాట్లు పడ్డాడట.. చివరకు దిల్ రాజు తీసిన ‘ఎంసీఏ’తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మూడో సినిమాగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీని డైరెక్ట్ చేయడం విశేషం.
పవన్ తో సినిమా చేసే అవకాశం దొరకడం తన అదృష్టం అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు. మూడు సార్లు ఈ కథను పవన్ కు వివరించానని కథ చెప్పగానే ఆయన కేవలం ‘ఓకే ’ అని మాత్రమే సమాధానమిచ్చారని తెలిపారు. దానిని మించి ఎలాంటి రియాక్షన్ లేదన్నారు.
నా మొదటి చిత్రానికే లైఫ్ లో దిబెస్ట్ ఫెయిల్యూర్ చూశానని.. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా తర్వాత పదేళ్లుగా ఖాళీగా ఉన్నానని పాత జ్ఞాపకాలను దర్శకుడు గుర్తు చేసుకున్నాడు.
నిజానికి ‘వకీల్ సాబ్’ మూవీకి తొలుత ‘ముగవా లోకానికి తెలుసా నీ విలువా’ అనే టైటిల్ ను అనుకున్నారట.. కానీ తర్వాత ‘లాయర్ సాబ్’ , వకీల్ సాబ్ గా మారిందని.. చివరకు ఏది పెట్టాలని ఆలోచించి ‘వకీల్ సాబ్’ను ఖరారు చేశామన్నారు.
ఇక వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో తొలి రోజు పవన్ వాకింగ్ చేస్తున్న స్టిల్ ను ఎవరో దొంగచాటుగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని.. అది కాస్తా వైరల్ కావడంతో నాకెంతో ఆ స్టిల్ నచ్చి డిజైన్ చేయించి సినిమా టైటిల్ లో పెట్టామని వేణు శ్రీరామ్ తెలిపాడు.
‘బద్రి’ సినిమాలో హీరో విలన్లను నటించిన పవన్, ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాలోనూ లాయర్లుగా ఇరగదీశారని.. బద్రిలో ‘నందా’పేరునే ‘వకీల్ సాబ్ ’లో ప్రకాష్ రాజ్ కు పెట్టామని దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.