
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు దేశమంతా క్రేజ్. ఒకప్పుడు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన ఈ హిట్ దర్శకుడు ఇప్పుడు ‘బాహుబలి’ తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అందుకే ఆయన నెక్ట్స్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది.
అయితే టాలీవుడ్ లోనే నంబర్ 1 దర్శకుడు అయిన రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారన్న నటించాలన్న కోరిక చాలా మంది హీరోలకు ఉంటుంది. టాలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం రాజమౌళి దర్శకత్వంలో చేయాలని తపన పడుతుంటారు. దాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు కూడా.
అయితే రాజమౌళి మాత్రం కథను బట్టే హీరోను ఎంపిక చేస్తారు. తెలుగులో అగ్రహీరోలు అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లతో రాజమౌళి సినిమా తీయలేకపోయాడు. కథకు తగ్గట్టు హీరోలను ఎంపిక చేస్తాడు జక్కన్న. చిన్న హీరోనైనా తనకు అనుకూలంగా మార్చి ఆ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తాడు.
అయితే రాజమౌళి తన సినిమాల్లో ఒకరిద్దరు మినహా పెద్దగా అగ్రహీరోలకు ప్రిఫరెన్స్ ఇవ్వడు. పిరియాడిక్ చిత్రాలకే పరిమితమైన ఈ జక్కన్న హీరో కంటే తన డైరెక్షన్ కనిపించే విధంగా సినిమా తీస్తాడు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో ప్రముఖ హీరోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లు మాత్రమే నటించారు. అయితే పవన్ కల్యాన్ తో కూడా సినిమా తీస్తాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి పవన్ కల్యాన్ కోసం జక్కన్న ఇదివరకే ఓ కథను సిద్ధం చేశాడట. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా అది కాస్తా అడుగున పడింది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఒక కథను తయారు చేసి పవన్ కల్యాణ్ కు స్టోరీ కూడా చెప్పాడని టాక్. అయితే ఆ సమయలో పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమా సమయం దొరకలేదు. దీంతో రాజమౌళి సైతం బాహుబలి సినిమా మీద పడడంతో దానిని మళ్లీ బయటకి ఆ కథ తీయలేదుంటున్నారు.
మూడేళ్ల విరామం తరువాత పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వకీల్ సాబ్ సినిమాతో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇటీవల విడుదలైఆ సినిమా ట్రైలర్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సమయంలో పవన్ గురించి రకరకాల చర్చలు బయటికి వచ్చాయి. ఇందులో పవన్ -రాజమౌళి తో సినిమా చేస్తున్నాడన్న టాపిక్ హాట్ హట్ గా మారింది.దీనిపైకొందరు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మరి సంవత్సరాల కొద్దీ సినిమాలు తీసే మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ రాజమౌళి .. జెట్ స్పీడుగా సినిమాలు పూర్తి చేసే పవన్ తో ఆ సినిమా తీస్తాడా..?వీరిద్దరికి సూట్ అవుతుందా? లేదా.. చూడాలి.