
త్రివిక్రమ్ కి ఒక అలవాటు ఉంది. ఒకే హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేయడం. గతంలో సమంతతో అలాగే చేసాడు. ఇలియానాతో కూడా రెండు సినిమాలు అలాగే చేసాడు. ప్రస్తుతం పూజ హెగ్డేతోనూ అలాగే చేస్తున్నాడు. నిజానికి అమ్మడు తన కెరీర్ మొదట్లో చేసిన సినిమాలన్నీ భారీ ప్లాప్ లే. ఇక కెరీర్ పోయింది, నిధి అగర్వాల్ లాగా ఐటమ్ క్యారెక్టర్స్ కు సిద్ధ పడే టైం వచ్చింది అనుకునే సమయంలో త్రివిక్రమ్ పూజ హెగ్డేకి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.
తన దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’లో మొదట కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ, అంతలో త్రివిక్రమ్ కి పూజ హెగ్డే బాగా నచ్చిందట. దాంతో నిర్మాతలకు నచ్చచెప్పి మరి మొత్తానికి పూజ హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమాతో ఆమెకు తొలి విజయం దక్కింది. ఇక అక్కడ నుండి ఈ భామ రాత పూర్తిగా మారిపోయింది. తక్కువ టైంలోనే మంచి అవకాశాలతో పాటు స్టార్ డమ్ ను అందుకుంది.
అమ్మడికి ఉన్న ఐరన్ లెగ్ పేరు కాస్త, గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఈ లోపు త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో తీసిన ‘అల వైకుంఠపురంలో’ కూడా ఈ ముద్దుగుమ్మనే పెట్టుకుని, ఆమె కోసం ప్రత్యేక సాంగ్ లు రాయించి, ఆమె చేత ప్రత్యేకమైన స్టెప్స్ వేయించి.. మొత్తానికి ఆమెకున్న క్రేజ్ ను అమాంతం పెంచాడు. ఆ సినిమా ఘన విజయంలో పూజ హెగ్డే ప్రముఖ పాత్ర పోషించిందనే క్రెడిట్ ను కూడా ఆమెకు కట్టబెట్టాడు త్రివిక్రమ్.
అందుకే త్రివిక్రమ్ కి తన డేట్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పబ్లిక్ గానే చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. తన పై అంత అభిమానం చూపిస్తోంది కాబట్టే.. త్రివిక్రమ్ కూడా ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వడానికి తెగ ఉత్సాహ పడుతున్నారు. పైగా ఎన్టీఆర్ తో చేయబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులోనే ఈ బ్యూటీనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏమైనా పూజని త్రివిక్రమ్ ఇప్పట్లో వదిలేలా లేరు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్