
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగబాబు.. రాక్షసుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలుచిత్రాల్లో నటించారు. నిర్మాతగా మారి విజయవంతమైన సినిమాలు తీశారు.
ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించి, తెలుగు ఆడియన్స్ కు మరింత క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత మరో షోలో కొంతకాలం ఉన్న ఆయన.. ఓ యూట్యూబ్ చానల్ ను కూడా రన్ చేస్తున్నారు. ‘నా ఛానల్.. నా ఇష్టం’ అంటూ.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చేస్తుంటారు.
ఇప్పటికీ అడపాదడపా పలు చిత్రాల్లో కనిపిస్తున్నారు మెగా బ్రదర్. అరవింద సమేతలో ఎన్టీఆర్ తండ్రిగా కనిపించి అలరించారు. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ కూ పరచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న-ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఇందులో విలన్ క్యారెక్టర్లో నటిస్తున్నారట మెగా బ్రదర్.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. ఈ పాత్రను చాలా క్రూరంగా చూపించబోతున్నట్టు సమాచారం. అయితే.. ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు నాగబాబు.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వహించారు. ఈ సంద్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడగ్గా.. ‘లేదు.. వచ్చే ఏడాది చేసుకుంటా.. మీరు తప్పక రావాలి’ అని కామెంట్ చేశారు. మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? అని మరో నెటిజన్ అడగ్గా.. ‘ఈ వయసులో నాకు పెళ్లా..? మీకూ ఓకే అయితే నాకూ ఓకే’ అని రిప్లీ ఇచ్చారు.
ఇక, మరో వ్యక్తి వకీల్ సాబ్ ట్రైలర్ లోని డైలాగును నాగబాబు మీద ప్రయోగించాడు. ‘ఆర్ యూ వర్జిన్’ అని అడిగాడు. దానికి ‘అరే ఏంట్రా ఇదీ..? ’ అంటే ఓ మీమ్ షేర్ చేశారు నాగబాబు. దీంతో.. వైరల్ అయ్యింది.