వివాదం పై సమంత మౌనం.. దర్శకులు వివరణ !

‘అక్కినేని సమంత’ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ నిషేధించాలని తమిళనాడులో మొదలైన రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. ఎంపీ వైకో కూడా ఈ వెబ్ సిరీస్ పై సీరియస్ అవ్వడంతో మేకర్స్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సిరీస్ దర్శకులు రాజ్ నిడుమోర్, కృష్ణ డీకే ఓ ప్రకటన విడుదల చేశారు. “ది ఫ్యామిలీ మేన్ 2లో కీలక పాత్రలో నటించిన సమంత ఒక తమిళ అమ్మాయి. అదే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ […]

Written By: admin, Updated On : May 25, 2021 11:00 am
Follow us on


‘అక్కినేని సమంత’ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ నిషేధించాలని తమిళనాడులో మొదలైన రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. ఎంపీ వైకో కూడా ఈ వెబ్ సిరీస్ పై సీరియస్ అవ్వడంతో మేకర్స్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సిరీస్ దర్శకులు రాజ్ నిడుమోర్, కృష్ణ డీకే ఓ ప్రకటన విడుదల చేశారు. “ది ఫ్యామిలీ మేన్ 2లో కీలక పాత్రలో నటించిన సమంత ఒక తమిళ అమ్మాయి.

అదే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో పనిచేసిన వారిలో కొంతమంది తమిళీయులు ఉన్నారనే విషయం కూడా మీకు చెబుతున్నాము. ఇక సాంకేతిక నిపుణుల్లో ఎక్కువమంది తమిళనాడుకి చెందిన వారే. కాబట్టి, తమిళీయుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ సిరీస్ ఉండదు. తమిళీయులను మేము గౌరవిస్తాం. ఈ సిరీస్ లో తమిళ వారిని కించేపరిచేలా ఒక్క సీను గాని, ఒక్క డైలాగ్ గాని లేదు అని మేము నమ్మకంగా చెప్పగలం.

ఈ సిరీస్ చూసిన తర్వాత ఇప్పుడు గొడవ చేస్తున్నవారే
మా ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకుంటారు’ అంటూ దర్శకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇంతవరకు సమంత మాత్రం ఈ వివాదం పై ఎక్కడా స్పందించలేదు. ఒక పక్క ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. మరోపక్క సామ్ ఈ సిరీస్ ని ప్రోమోట్ చేస్తోంది. అయినా వివాదం పై పెదవి విప్పట్లేదు. ఇక ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయిన క్షణం నుండి తమిళీయులు మాత్రం సమంత మీద విరుచుకు పడుతూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు.

అసలు ఇంతకీ వివాదం ఏమిటంటే..
ఈ వెబ్ సిరీస్ లో సమంత ఎల్టీటీఈ’
తీవ్రవాదిగా నటించింది. అయితే ఈ ‘ఎల్టీటీఈ’ తీవ్రవాద సంస్థను, వాళ్ళు అభిమానిస్తారు. తమిళీయుల దృష్టిలో అదొక పోరాటం. శ్రీలంకలోని తమిళీయుల కోసమే పోరాడింది ఎల్టీటీఈ. అందుకే ఇది అంటే వారికి ప్రత్యేక అభిమానం.