Homeఎంటర్టైన్మెంట్Sonia Agarwal: ఛాన్స్ ల కోసం లేటు వయసులో హీరోయిన్ తాపత్రయం !

Sonia Agarwal: ఛాన్స్ ల కోసం లేటు వయసులో హీరోయిన్ తాపత్రయం !

Sonia Agarwal: ‘7/G బృందావన కాలని’ అంటూ తెలుగు తెరకు ముద్దుల తారగా పరిచయం అయింది సోనియా అగర్వాల్‌. అందంతో పాటు అభినయంలోనూ సోనియా అగర్వాల్‌ కి ప్రత్యేక టాలెంట్ ఉంది. పైగా మొదటి సినిమా భారీ విజయం సాధించింది. కానీ, డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ ప్రేమలో పడి.. తెలుగులో హీరోయిన్‌ గా చేయమని భారీ అవకాశాలు వచ్చినా చేయలేదు. వచ్చిన స్టార్ డమ్ ను గాలికి వదిలేసింది.

Sonia Agarwal
Sonia Agarwal

అమాయకంగా, క్యూట్‌ క్యూట్‌ గా కనిపించే ఈ భారీ అందాల భామ మొత్తానికి ఆ తర్వాత ప్రేమకే ఓటు వేసి.. డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది. అయితే, పెళ్లి అయ్యాక, సెల్వరాఘవన్‌ తో ఆమె సంతోషంగా లేదట. చాలా సంవత్సరాలు భరించి భరించి విసిగిపోయి చివరకు.. సెల్వరాఘవన్‌ కి గుడ్ బాయ్ చెప్పింది.

తిరిగి చూసుకుంటే సెల్వరాఘవన్‌ తో పెళ్లి తప్ప ఆమె జీవితంలో ఆమెకంటూ ఏమి మిగలలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సాలిడ్ గా ఏమి లేదు. అందుకే, ఇక తప్పక లేటు వయసులో కూడా గ్లామర్ గేట్లు ఓపెన్ చేసి.. సినిమాల్లోకి మళ్ళీ దూకేసింది. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా.. తెర పై ప్రభావం చూపలేకపోయింది.

Also Read: మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన హీరోలు వీళ్ళే !

అయితే, తనకు ఉన్న సినీ ఇండస్ట్రీ పరిచయాలతో మొత్తానికి అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకుంటూ వస్తోంది. పైగా వయసు పెరుగుతున్నా, రోజురోజుకు తనలోని అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు మతులు పోగొట్టడానికి ఈ మధ్య తెగ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. కానీ సినిమా ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. రాకపోయినా.. ఈ ముదురుభామ మాత్రం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పటికీ తనలో తరగని గ్లామర్ ఉంది అంటుంది. ఇదే విషయాన్ని డైరెక్ట్ గా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ ఛాన్స్ లు అడుగుతుంది. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకు ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం దారుణం అంటూ ఎమోషనల్ కూడా అవుతుంది. అసలుకే తానూ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను అంటూ ఆమె బాధపడుతుంది. డబ్బును సంపాధించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమెకు అవకాశాలు వస్తాయా ? చూడాలి.

Also Read: బ్రేకప్ గురించి ఓపెన్ అయిన అనుపమ పరమేశ్వరన్… ఎవరితో అంటే ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper
Exit mobile version