AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోయినా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రం డబ్బులు సరైన సమయానికి వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రజల్లో పట్టు సాధిస్తున్నారు. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలో జగన్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. దీనికి గాను 9న జగన్ ఈ పథకం ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ర్టంలో దాదాపు నాలుగు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వారికి ప్రతి సంవత్సరం రూ.15 వేలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి రూ. 589 కోట్లు కేటాయించారు. ప్రజలకు నేరుగా తమ ఖాతాల్లో వేసేందుకు సిద్ధమయ్యారు. ఏడు రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ప్రచారం నిర్వహించాలని సూచించారు.
Also Read: జగన్ మోడీకి సమర్పించిన వినతిపత్రం ఎలా ఉంది?
45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ప్రతి ఏటా సాయం చేసేందుకు జగన్ నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈబీసీ వర్గాలకు ఈ పథకం వర్తింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈబీసీ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండటంతో వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగానే వారికి సంక్షేమ పథకాలు అందజేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వం నియమనిబంధనలు జారీ చేసింది. దీంతో ఏరివేత కార్యక్రమం నిర్వహించి అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి గాను పలు ఆంక్షలు విధిస్తున్నారు. సంక్షేమ పథకాలు సరైన వారికే చేరాలని చూస్తున్నారు. ఇందుకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో అసలైన వారికే లాభం చేకూరేలా మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఢిల్లీ టూ ఏపీ చక్కర్లేనా?.. జగన్ పర్యటనపై అనుమానాలు?