https://oktelugu.com/

రూ.కోటి ఎగ్గొట్టాడు: ప్రముఖ నిర్మాతపై చీటింగ్ కేసు?

సినిమా రంగం అనేది ఒక రంగుల కళ. హిట్ అయితే కోట్ల రూపాయలు వస్తాయి. లాభాల పంట పడుతుంది. అదే ఫ్లాప్ అయితే సినిమాకు చేసిన అప్పులు ఇక జీవితాంతం తీర్చలేకుండా పరిస్థితి తయారవుతుంది. రాజకీయ నాయకులు కూడా సినిమాల్లోకి వచ్చి నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు. తాజాగా సినీ నిర్మాత, టీడీపీ నేత భవ్య ఆనందప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదైనట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2021 / 01:57 PM IST
    Follow us on

    సినిమా రంగం అనేది ఒక రంగుల కళ. హిట్ అయితే కోట్ల రూపాయలు వస్తాయి. లాభాల పంట పడుతుంది. అదే ఫ్లాప్ అయితే సినిమాకు చేసిన అప్పులు ఇక జీవితాంతం తీర్చలేకుండా పరిస్థితి తయారవుతుంది. రాజకీయ నాయకులు కూడా సినిమాల్లోకి వచ్చి నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు.

    తాజాగా సినీ నిర్మాత, టీడీపీ నేత భవ్య ఆనందప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదైనట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలిసింది.

    కోటీ రూపాయలకు పైగా అప్పు తీసుకొని ఏళ్లు గడుస్తున్నప్పటికీ తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ జూపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

    2017లో జూపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి భవ్య సిమెంట్స్ అధినేత ఆనందప్రసాద్ అర్జంట్ గా డబ్బు అవసరం ఉందని.. కొన్ని హైదరాబాద్ స్థలాలు హామీగా పెటట్ి అప్పు తీసుకున్నట్టు తెలిసింది. అప్పు తీర్చకపోతే భూములను మార్కెట్ ధరకు రిజిస్టర్ చేస్తానని చెప్పారట.. కానీ ఆ డీల్ జరగలేదని తెలిసింది.

    అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్మాత ఆనంద ప్రసాద్ తనకు ఎలాంటి చెల్లింపులు జరపలేదని .. పైగా డబ్బు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.