నీళ్లలో ఇంగువ పౌడర్ కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా.?

మన దేశంలోని వంటకాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంగువను వినియోగిస్తున్నారు. ఇంగువ ఆహారానికి మంచి వాసన ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంగువ అజీర్తి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇంగువను పొడిలా చేసుకుని వేడినీటిలో కలుపుకుని తాగితే మంచిది. Also Read: ఈ నీళ్లతో కిడ్నీలో రాళ్లకు సులువుగా చెక్.. ఎలా అంటే..? ఆమ్లత సమస్య నుండి తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంలో […]

Written By: Kusuma Aggunna, Updated On : March 28, 2021 5:53 pm
Follow us on

మన దేశంలోని వంటకాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంగువను వినియోగిస్తున్నారు. ఇంగువ ఆహారానికి మంచి వాసన ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంగువ అజీర్తి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇంగువను పొడిలా చేసుకుని వేడినీటిలో కలుపుకుని తాగితే మంచిది.

Also Read: ఈ నీళ్లతో కిడ్నీలో రాళ్లకు సులువుగా చెక్.. ఎలా అంటే..?

ఆమ్లత సమస్య నుండి తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంలో ఇంగువ పౌడర్ ఉపయోగపడుతుంది. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు ఇంగువ పౌడర్ కలిపిన వేడి నీళ్లు తాగడం ద్వారా షుగర్ లెవెల్స్ ను సులువుగా కంట్రోల్ చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇంగువ పౌడర్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. ఇంగువ దంతాలను బలపరచడంతో పాటు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడుతుంది.

Also Read: వెన్న తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా…?

ఇంగువ పౌడర్ లో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కళ్లు పొడి బారకుండా చేయడంలో తోడ్పడుతుంది. నీళ్లలో ఇంగువ పౌడర్ వేసి తాగడం వల్ల కళ్లు ప్రకాశవంతగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇంగువ పౌడర్ ఉబ్బసం సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. ఇంగువ పౌడర్ ఎముక సంబంధిత సమస్యల నుంచి దూరం చేయడంతో పాటు ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.

ఇంగువ పౌడర్ మూత్రాశయం మరియు మూత్రపిండాలను శుభ్రపరిచి కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఇంగువను వేడి నీటిలో కలిపి తీసుకుంటే మంచిది.