https://oktelugu.com/

గ్లామర్ భామకి పెళ్లి.. అయినా అవి వదిలేలా లేదు !

హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. కొంతమంది హీరోయిన్లు మాత్రమే అభిమానుల్లో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను తెచ్చుకుంటారు. నిజానికి స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సాగుతుంది ఈ అభిమానుల పిచ్చి. అందుకే తమిళంలో నమిత లాంటి సెకెండ్ గ్రేడ్ హీరోయిన్లకు కూడా గుడి కట్టించి పూజలు చేసింది. అలాంటి ఫాలోయింగే ఉంది రేజీనాకి కూడా. వాస్తవానికి రేజీనాకి ఎప్పుడూ తెలుగులో స్టార్ డమ్ రాలేదు. అయినా పట్టు వదలకుండా సినిమాలు చేసుకుంటూనే వస్తోంది. నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా […]

Written By:
  • admin
  • , Updated On : April 21, 2021 / 11:05 AM IST
    Follow us on


    హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. కొంతమంది హీరోయిన్లు మాత్రమే అభిమానుల్లో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను తెచ్చుకుంటారు. నిజానికి స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సాగుతుంది ఈ అభిమానుల పిచ్చి. అందుకే తమిళంలో నమిత లాంటి సెకెండ్ గ్రేడ్ హీరోయిన్లకు కూడా గుడి కట్టించి పూజలు చేసింది. అలాంటి ఫాలోయింగే ఉంది రేజీనాకి కూడా. వాస్తవానికి రేజీనాకి ఎప్పుడూ తెలుగులో స్టార్ డమ్ రాలేదు. అయినా పట్టు వదలకుండా సినిమాలు చేసుకుంటూనే వస్తోంది. నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేసింది మధ్యమధ్యలో. అయినా ఆమెకు కెరీర్ పరంగా ఏది ఉపయోగపడలేదు.

    అందుకే, ఇక సినిమాలకు స్వస్తి చెప్పి.. ఫ్యామిలీ లైఫ్ తో లైఫ్ ను లీడ్ చేద్దామని ఫిక్స్ అయిందట. నిజంగా ఈ న్యూస్ రెజినా అభిమానులకు షాక్ కలిగించేదే. మొత్తానికి గ్లామర్ భామ రెజినా కాసాండ్రాకు కూడా పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆమె దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె చిన్ననాటి స్నేహితుడితో పెళ్లి ఖరారు అయిందట. అయితే రెజినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది లాంటి విషయాలు ఇంకా తెలియదు. అలాగే ఆమెకు కాబోయే భర్త, సినిమా రంగానికి చెందిక వ్యక్తా లేక బిజినెస్ మెనా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఎలాగూ సినిమా కెరీర్ పరంగా రెజినాకు ఎన్నడూ కాలం కలిసి రాలేదు.

    కనీసం వ్యక్తిగత జీవితం పరంగానైనా ఆమెకు కలిసి రావాలని ఆశిద్దాం. సినిమాల్లో వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న రెజీనా.. ఫ్యామిలీ లైఫ్ పరంగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక రేజీనా మాత్రం పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేయాలనుకుంటుంది. ఆమెకు నటనను మానేయడం ఇష్టం లేదట. అవకాశాలు వస్తే.. పెళ్లి తరువాత నటించాలి అని అమ్మడు ఆరాట పడుతుంది. కాకపోతే ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేవు అనుకోండి. కాబట్టి, ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తీ చేసి ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండటం బెటర్ అని ఆమె సన్నిహితులు ఉచిత సలహాలు పడేస్తున్నారట. మరి రెజీనా ఏమి చేస్తోందో చూడాలి.