https://oktelugu.com/

అధికారిక ప్రకటన: హనుమంతుడి జన్మస్థలం ఇదే!

హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుడు. అలాంటి హనుమాన్ ను చిరంజీవి అని అందరూ నమ్ముతుంటారు. శ్రీరాముడి దూతగా.. భక్తుల ఇలవేల్పుగా ఆంజనేయుడు ఉంటారు. అలాంటి హనుమంతుడి జన్మస్థలంపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. హనుమంతుడు శ్రీవేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల గిరులపై పుట్టాడని టీటీడీ చెబుతుండగా.. కాదు కాదు.. కర్ణాటకలో పుట్టాడని ఆ రాష్ట్రం వాదిస్తోంది. ఇక మహారాష్ట్రలో అని కొందరు.. కేరళలో అని మరికొందరు అక్కడి స్థల పురాణాలను వల్లెవేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై టీటీడీ ఎంతో మంది […]

Written By: , Updated On : April 21, 2021 / 12:50 PM IST
Follow us on

హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుడు. అలాంటి హనుమాన్ ను చిరంజీవి అని అందరూ నమ్ముతుంటారు. శ్రీరాముడి దూతగా.. భక్తుల ఇలవేల్పుగా ఆంజనేయుడు ఉంటారు. అలాంటి హనుమంతుడి జన్మస్థలంపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. హనుమంతుడు శ్రీవేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల గిరులపై పుట్టాడని టీటీడీ చెబుతుండగా.. కాదు కాదు.. కర్ణాటకలో పుట్టాడని ఆ రాష్ట్రం వాదిస్తోంది. ఇక మహారాష్ట్రలో అని కొందరు.. కేరళలో అని మరికొందరు అక్కడి స్థల పురాణాలను వల్లెవేస్తున్నారు.

దీంతో ఈ వివాదంపై టీటీడీ ఎంతో మంది పురాణ ఇతిహాసాలపై పట్టున్న మేధావులతో కమిటీని వేసింది. కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశోధన చేసి హనుమంతుడు తిరుమల గిరుల్లోని అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారు. నాలుగు నెలలపాటు పరిశోధించి ఈ వివరాలను వెల్లడించారు.

తాజాగా హనుమంతుడి జన్మస్థానంపై టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. సప్త గిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. ‘శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు’ అని టీటీడీ జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ వెల్లడించారు.