ప్రభాస్ తో డేట్ కి రెడీ – ‘రష్మిక మండన్నా’

క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ కూడా తన మనసులోని మాటను ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏమిటి ఆ మనసులో మాట అంటే ? ప్రభాస్ తో డేట్ వ్యవహారం. నిజానికి ప్రభాస్ తో డేట్ కి రెడీ అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బహిరంగంగానే స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హీరోయిన్ల లిస్ట్ లో వచ్చి చేరింది రష్మిక. నేషనల్ స్టార్ ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడానికి తానూ […]

Written By: admin, Updated On : May 28, 2021 5:47 pm
Follow us on

క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ కూడా తన మనసులోని మాటను ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏమిటి ఆ మనసులో మాట అంటే ? ప్రభాస్ తో డేట్ వ్యవహారం. నిజానికి ప్రభాస్ తో డేట్ కి రెడీ అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బహిరంగంగానే స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హీరోయిన్ల లిస్ట్ లో వచ్చి చేరింది రష్మిక.

నేషనల్ స్టార్ ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడానికి తానూ ఎప్పుడైనా రెడీ అంటూ రష్మిక చెప్పడం ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఇప్పుడు రష్మిక ఈ డేట్ పై ఎందుకు కామెంట్ చేసింది అంటే.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా కామెంట్ చేసింది. మిమ్మల్ని ఎవరితో డేట్ కి వెళ్ళమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎవరు పేరు చెబుతారు ? అని అడగగానే,

రష్మిక నాలుగు సెకన్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ప్రభాస్ పేరు చెప్పింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ బాబు సరసన ఆడిపాడి, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుని చివరకు మహేష్ పేరు చెప్పకుండా, ప్రభాస్ పేరు చెప్పి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అలాగే అల్లు అర్జున్ తో ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తోంది.

అయినా బన్నీ పేరు కూడా చెప్పలేదు. మొత్తానికి స్టార్ హీరోల సరసన నటిస్తోన్న ఈ భామకు అందరి స్టార్స్ లో కల్లా ప్రభాస్ బాగా నటించినట్టు ఉన్నాడు. ఇక రష్మిక హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తోంది.