అచ్చెన్నా.. గిదేందన్నా?

అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నాయకుల తీరే వేరు. వారి మాటలు ఎవరికి అర్థం కావు. వారి చేతలైతే అంతుబట్టవు. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది కూడా తానేనని పదేపదే వల్లె వేస్తుంటారు. ఇప్పుడు అదే కోవలో అచ్చెన్నాయుడు కూడా చేరిపో యారు. ఎందుకంటే ఆయనలో కూడా ప్రవహించేది టీడీపీ రక్తమే కదా మరి. రాజకీయాల్లో అచ్చెన్నాయుడు కొత్త ట్రెండ్ […]

Written By: Srinivas, Updated On : May 28, 2021 5:38 pm
Follow us on

అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నాయకుల తీరే వేరు. వారి మాటలు ఎవరికి అర్థం కావు. వారి చేతలైతే అంతుబట్టవు. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది కూడా తానేనని పదేపదే వల్లె వేస్తుంటారు. ఇప్పుడు అదే కోవలో అచ్చెన్నాయుడు కూడా చేరిపో యారు. ఎందుకంటే ఆయనలో కూడా ప్రవహించేది టీడీపీ రక్తమే కదా మరి.

రాజకీయాల్లో అచ్చెన్నాయుడు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంలో లోకేష్ నే మించిపోయారు. గతంలో లోకేష్ స్వాతంత్ర్య పోరాటంలో టీడీపీ పాల్గొందని సెలవిచ్చారు. అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని మరో బాంబు పేల్చారు. దీంతో లోకేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాటలకు అంతా నవ్వుకుంటున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం టీడీపీ రాష్ర్ట అద్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకే భాష్యం చెప్పిన వీరుడని కొనియాడారు. సినిమా రంగం ద్వారా అందరిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ఎన్టీఆర్ కారణంగా మోదీ ప్రధాని అయ్యారని మరో అర్థం కాని ప్రశ్న లేవనెత్తారు. మోదీకి ఎన్టీఆర్ కు ఏం సంబంధం అని అందరూ తలలు పట్టుకుంటున్నారు.

ఎన్టీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేశారనే కోణంలో మోదీ ప్రధాని కావడానికి కారణం అనే కోణంలో మాట్లాడారని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో లోకేష్ మాట్లాడాల్సిన మాటలు అచ్చెన్నాయుడు మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే కోణంలో చూస్తున్నారు. అచ్చెన్నాయుడు మాటలకు అందరు అచ్చెరువొందుతున్నారు. టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఆయన మాట్లాడిన తీరు అందరిలో ఆలోచనలకు తెరలేపింది.