
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్ అంటే.. ‘రష్మిక మండన్నా’నే. గీతగోవిందం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ బ్యూటీకి వరుసగా సినిమాలు వస్తున్నాయి. పైగా స్టార్ హీరోల సరసన జోడి కట్టేస్తూ రోజురోజుకూ బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. రష్మిక ఇప్పటికే మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో జోడి కట్టేసింది కాబట్టి.. ఇక ఆమె తరువాత టార్గెట్ ఎన్టీఆర్, రామ్ చరణేనట. .
అందుకే వాళ్ళ తదుపరి సినిమాల్లో తనకు మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చేలా పావులు కదుపుతుంది. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా చేస్తున్నాడు. అందుకే దిల్ రాజును పట్టుకుని.. అటు నుండి చరణ్ సినిమాలో హీరోయిన్ వేషానికి తెగ వేషాలు వేస్తోందట. దిల్ రాజు కూడా ఈ యంగ్ బ్యూటీ ఆశకి తలొగ్గేలా ఉన్నాడట. మరి శంకర్ కూడా ఒప్పుకుంటే.. చరణ్ సరసన హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయినట్టే. ఎలాగూ చరణ్ కాదు అనడు. అలాగే ఎన్టీఆర్ సినిమాలో రష్మిక నటించబోతుంది అంటూ ఇప్పటికే అనేక రూమర్లు వచ్చాయి.
ప్రస్తుతానికి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది అంటున్నారు. అయితే ఒకవేళ ఈ సినిమా గానీ, సెట్స్ పైకి వెళ్లితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికనే ఉండే అవకాశం ఉంది. ఇక రష్మిక అటు హిందీలో కూడా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు అక్కడ ఆల్ రెడీ రెండు సినిమాల్లో నటిస్తోంది. మరి ఇలా రోజురోజుకూ హీరోయిన్ గా తన పరిధిని పెంచుకుంటూ పోతున్న రష్మిక, తన గ్లామర్ విషయంలోనూ అందరికంటే ఓ మెట్టు పైనే ఉండాలని ఫిక్స్ అయిందట. అందుకే ఇక నుండి అందాలు ఆరబోయటానికి అసలు మొహమాట పడదు అట.