https://oktelugu.com/

`కేజీఎఫ్’ నుండి క్రేజీ అప్ డేట్.. మరి రిలీజ్ పరిస్థితి ?

షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2`లో ప్రముఖ నటుడు రావు రమేష్ ఓ ప్రధానమైన సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ టైమ్స్ అంటూ న్యూస్ పేపర్ డిజైన్ లో రావు రమేష్ పాత్ర ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ.. చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి పోస్టర్ అయితే […]

Written By:
  • admin
  • , Updated On : May 25, 2021 / 12:10 PM IST
    Follow us on


    షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2`లో ప్రముఖ నటుడు రావు రమేష్ ఓ ప్రధానమైన సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ టైమ్స్ అంటూ న్యూస్ పేపర్ డిజైన్ లో రావు రమేష్ పాత్ర ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ.. చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి పోస్టర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ లుక్ లో కనిపిస్తుంది.

    కాగా రావు రమేష్ ఈ సినిమాలో నటిస్తుండటంతో.. మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నట్లు అయింది. ఇప్పటికే రావు రమేష్ కి సంబంధించిన పార్ట్ ను ఎడిటింగ్ చేశారని, సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమాలో రావు రమేష్ సీన్స్ ఐదు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ భారీ సినిమాకి ప్రస్తుతం రిలీజ్ డేట్ బాగా వేధిస్తోంది. ఎందుకంటే భారీ సినిమాలకు భారీ తారాగణం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విడుదల తేదీ అంతకంటే ముఖ్యం అనేది ఇండస్ట్రీలోని మాట.

    కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వకపోతే భారీ వసూళ్లు రావు. మరి వందల కోట్లు పెట్టి తీసిన సినిమాకి బిజినెస్ పరంగా న్యాయం జరగాలంటే.. కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ ఉండాలి. సోలో డేట్ కోసం మేకర్స్ పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్న క్రమంలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. దాంతో ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’కి సోలో రిలీజ్ అనేది అయోమయంలో పడింది.

    అసలు ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. అందుకే సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ కి సిద్ధమయ్యే లోపు, సెకెండ్ వేవ్ తో ‘కేజిఎఫ్ 2’కి భారీ దెబ్బ తగిలింది. ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ రావాలంటే.. ఇక మిగిలింది దసరా సీజనే. అయితే, దసరాకి తెలుగులో మహేష్, బన్నీ , మెగాస్టార్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి కేజీఎఫ్ రిలీజ్ కష్టమే.