బెయిలొచ్చినా విడుదల కాని రఘురామ

రఘురామ కృష్ణం రాజు విడుదల వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇచ్చినా ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. డిశ్చార్జి సమ్మరీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇవ్వలేదు. దీంతో ఆయనకు అనారోగ్యం ఉందని నాలుగు రోజులు చికిత్స చేయాల్సి ఉందని మీడియాకు సమాచారం వచ్చింది. కానీ అసలు విషయం వేరే ఉందనే తెలుస్తోంది. రఘురామ విడుదలైన వెంటనే మరోసారి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. మఫ్టీలో ఆర్మీ ఆస్పత్రి వద్దకు […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 12:43 pm
Follow us on


రఘురామ కృష్ణం రాజు విడుదల వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇచ్చినా ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. డిశ్చార్జి సమ్మరీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇవ్వలేదు. దీంతో ఆయనకు అనారోగ్యం ఉందని నాలుగు రోజులు చికిత్స చేయాల్సి ఉందని మీడియాకు సమాచారం వచ్చింది. కానీ అసలు విషయం వేరే ఉందనే తెలుస్తోంది. రఘురామ విడుదలైన వెంటనే మరోసారి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. మఫ్టీలో ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రఘురామ బయటకు వస్తే మళ్లీ తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.

రఘురామ అరెస్టు వ్యవహారం తెలియడంతో ఆయన తరఫు న్యాయవాదులు వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ కూడా ఆర్మీ ఆస్పత్రి వైద్యులకు లేఖ రాశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని వివరించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకేు మరికొన్ని రో జులు ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని కోరారు. డిశ్చార్జి సమ్మరీ రాకపోవడంతో సీఐడీ కోర్టులోనూ సమర్పించలేదు. నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని మీడియాకు సమాచారం వచ్చింది.

రఘురామ తరఫు న్యాయవాది దుర్గా ప్రసాద్ గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి కోర్టు ధిక్కార నోటీసులు పంపించారు. తన క్లయింట్ రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. విడుదలైన పది రోజుల్లోపు ష్యూరిటీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అధికారికంగా ఆయన బె యిల్ పై విడుదలైనట్లేనని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ తన క్లయింట్ ను ఆర్మీ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే తక్షణమే తీసుకురావాలని ఎస్కార్టును పంపినట్లుగా తెలిసిందని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ అని పేర్కొన్నారు.

రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో బెయిల్ వచ్చింది. ఆయనపై అలాంటిది మరో కేసు పెట్టి అరెస్టు చేయడానికి వచ్చి ఉంటారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు నమోదైన విషయం అరెస్టు చేసిన తరువాత చెబుతారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సుప్రీంకోర్టు బె యిల్ ఇచ్చినా రఘురామ విడుదల అంత తేలిగ్గా జరిగేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.