
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. వైరస్ వ్యాప్తితో ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. ఇక మూడో వేవ్ వస్తే ప్రజల తట్టుకోవడం కష్టమే. అందుకే ఇప్పటి నుంచే ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుండడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి దేశంలో 20 లక్షల డోసుల స్థాయిలోనే వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉంది. దీంతో టార్గెట్ రీచ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రోజుకు 20 లక్షల చొప్పున టీకాలు వేసుకుంటూ పోతే దేశం మొత్తానికి రెండు డోసుల టీకాలు వేసేందుకు కనీసం రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఆ లోపు కరోనా మూడో వేవ్, నాలుగో వేవ్ కూడా వచ్చి కల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కన్నారు. వ్యాక్సినేషన్ స్థాయిని పెంచేందుకు కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్న సామాన్యుల్లో ఉత్పన్నం వ్యక్తం అవుతోంది.
ఇంతవరకు 19.84 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. రమారమీ సుమారు20 కోట్ల డోసులు అనుకున్నా టార్గెట్ లో 10 శాతానికి చేరువైనట్లు. మార్చి నెల నుంచి భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతున్నా ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులోకి రావచ్చని ఇన్నాళ్లు వార్తలైనా వచ్చేవి. అయితే ఇప్పుడు వాటి ఊసే కనిపించడం లేదు. రష్యన్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో ఉత్పత్తై అందుబాటులోకి వచ్చేందుకు ఆగస్టు వరకూ సమయం పట్టవచ్చని చెబుతున్నారు. దీంతో వ్యాక్సినేషన్ పై మెజార్టీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆశలు పెట్టుకునేందుకు ఏమీ లేదేమో.