
ఇటీవల భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్ లో యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఓ అదికారి మాట్లాడుతూ సెప్టెంబర్ 18 లేదా 19 న మిగతా సీజన్ ప్రారంభమవుతుందని మూడు వారాల్లో టోర్నీని పూర్తి చేస్తామని చెప్పారు. దాంతో అక్టోబర్ 9 లేదా 10 వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుందని తెలిపారు. ఈ క్రమంలోనే పది రోజులు డబుల్ హెడర్స్ మ్యాచ్ లు నిర్వహిస్తామని అన్నారు.