https://oktelugu.com/

‘హిరణ్య కశ్యప’ పరిస్థితి ఏమిటి.. క్రేజీ అప్ డేట్ !

హిరణ్య కశ్యప.. ఎంతో గొప్ప కథ. అందుకే భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ తాను హిరణ్య కశ్యప సినిమా నిర్మించబోతున్నానంటూ ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చాడు. పైగా హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి మాటలు రాస్తానని చెప్పాడట. మరి ఆ తరువాత ఏమైందో ఏమో..ఈ సినిమా గురించి మరో అప్ డేట్ లేదు. ‘రానా’ ప్రధాన పాత్రగా […]

Written By:
  • admin
  • , Updated On : March 27, 2021 4:35 pm
    Follow us on


    హిరణ్య కశ్యప.. ఎంతో గొప్ప కథ. అందుకే భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ తాను హిరణ్య కశ్యప సినిమా నిర్మించబోతున్నానంటూ ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చాడు. పైగా హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి మాటలు రాస్తానని చెప్పాడట. మరి ఆ తరువాత ఏమైందో ఏమో..ఈ సినిమా గురించి మరో అప్ డేట్ లేదు. ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతుందని ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబర్చారు. ఇప్పుడు ఆ ఆసక్తి ఎందుకు పనికి రాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే.. గుణశేఖర్ ప్రస్తుతం సమంత మెయిన్ లీడ్ గా శాకుంతల అంటూ మరో సినిమా చేస్తున్నాడు.

    మరి హిరణ్య కశ్యప పరిస్థితి ఏమిటి అని ఆరా తీస్తే.. ఈ సినిమా ఉంటుందని తేలింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 2023 జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగానే ఈ సినిమాను దాదాపు రెండు సంవత్సరాల పాటు పోస్ట్ ఫోన్ చేసారని తెలుస్తోంది. ఇక దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం. మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోందని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.

    ఏది ఏమైనా ఈ సినిమా గానీ వస్తే.. టాలీవుడ్ మరో మెట్టు పైకి ఎక్కినట్లే. అన్నట్టు ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుందనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించనున్నారు. అలాగే మిగిలిన బాషల్లోని ప్రముఖ నటీనటులను ఈ సినిమాలో నటింపచేయాలని మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వర్చ్యువల్ టెక్నాలజీని వాడటమే కారణం. ఆ టెక్నాలజీకి నెలలు తరబడి సమయం కేటాయించాల్సి వస్తోందట. దానికి తోడు పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఎక్కువ టైంను కూడా తీసుకుంటుందని సమాచారం. ఇక రానా మొన్న ‘అరణ్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ను అందుకున్నాడు.