Homeసినిమా వార్తలుRRRకు జ‌క్క‌న్న పారితోషికం.. సినిమా తీసేయెచ్చుగా!

RRRకు జ‌క్క‌న్న పారితోషికం.. సినిమా తీసేయెచ్చుగా!

Rajamouli
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రణం రుధిరం రౌద్రం. ఈ చిత్రం కోసం దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో అంశాలు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కాయి. అయితే.. ఇంత భారీ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారనే ఆస‌క్తి అంద‌రిలోనూ స‌హ‌జం.

ఇద్ద‌రు టాప్ స్టార్లు, బ‌డా నిర్మాత‌తో క‌లిసి అగ్ర‌ ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ సినిమా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. కాబోదు కూడా. లెక్క ఎంతైనా ప‌ర్లేదు బొమ్మ ప‌ర్ఫెక్ట్ గా తీయండ‌ని చెబుతున్న నిర్మాత ఓ వైపు.. ఎన్ని డేట్స్ అయినా ప‌ర్లేదు కావాల్సిన ఎమోష‌న్ తీసుకోమ‌ని చెప్పే న‌టులు ఇంకో వైపు.. వీరితో క‌లిసి త‌న‌దైన రీతిలో RRRను చెక్కుతున్నాడు జ‌క్క‌న్న‌.

ఇక‌, రాజ‌మౌళి స్టాంప్ రేంజ్‌ ఏంట‌నేది సాధార‌ణ ప్రేక్ష‌కులు మొద‌లు డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల వ‌ర‌కు అంద‌రికీ తెలిసిందే. అందుకే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతోంది. కోట్ల‌కు కోట్లు సూట్ కేసులు ప‌ట్టుకొని వెంట‌ప‌డుతున్నార‌ట బ‌య్య‌ర్లు. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమాకు జ‌రిగిన‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి క‌ళ్లు తేలేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా క‌లిపి దాదాపు రూ.240 కోట్ల‌కు ఈ సినిమాను అమ్మేసిన‌ట్టు స‌మాచారం. హిందీ రైట్స్ 140 కోట్ల‌కు బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ ద‌క్కించుకుందని తెలుస్తోంది. నార్త్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌తోపాటు భార‌త్ లోని అన్ని భాష‌ల డిజిటల్‌, శాటిలైట్‌, ఎలక్ట్రానిక్ హ‌క్కుల‌ను కూడా ఈ సంస్థే సొంతం చేసుకుంద‌ని టాక్‌.

ఇక‌, త‌మిళ‌నాడులో 48 కోట్లు, క‌ర్నాట‌క‌లో 45 కోట్లు, కేర‌ళ‌లో 15 కోట్లకు సినిమాను కొనుగోలు చేశార‌ట బ‌య్య‌ర్స్‌. ఓవ‌ర్సీస్ లో 70 కోట్లు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా 20 కోట్లు సాధించిన‌ట్టు టాక్‌. మొత్తంగా.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 900 కోట్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లి కేవ‌లం 500 కోట్ల బిజినెస్ మాత్ర‌మే చేసింది. దాదాపు రెట్టింపు కొల్ల‌గొట్టింది RRR.

మ‌రి, ఇంత భారీ చిత్రానికి రాజ‌మౌళి ఎంత తీసుకుంటున్నాడంటే.. పారితోషికం కింద 70 కోట్లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ 40 కోట్లు మాత్ర‌మే తీసుకుంటుండ‌గా.. రాజ‌మౌళి దాదాపు రెట్టింపు పారితోషికం తీసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం సాధించే విజ‌యాన్ని బ‌ట్టి జ‌క్క‌న్న డిమాండ్ ఇంకా పెరిగినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular