Homeసినిమా వార్తలుఅరె.. స్పీడ్ పెంచిన చిరంజీవి కుమార్తె !

అరె.. స్పీడ్ పెంచిన చిరంజీవి కుమార్తె !

Konidela Sushmita
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆమె నిర్మాణ రంగంలో అడుగు పెట్టినప్పటి నుండే, ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా కొత్త కొత్త ఐడియాలతో తన నిర్మాణ సంస్థను ముందుకు తీసుకువెళ్లాలని సుస్మిత ముమ్మరంగా ప్లాన్ చేసుకుంటోంది. పైగా ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్’ అని తన బ్యానర్‌ కు ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టుకున్నారు.

ఇక తమ కంపెనీ పేరు కూడా ఒక బ్రాండ్ అవ్వాలని సుస్మిత ప్రస్తుతంగా గోల్ గా పెట్టుకుందట. మరి సుస్మిత గోల్ కోసం మెగాస్టార్ ఏమి చేస్తారో చూడాలి. ఎలాగూ కుటుంబ సభ్యులతోనే సినిమాలు తీయాల‌ని ఆమె ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి, మెగాస్టార్ కూడా తన కుమార్తె కోసం డేట్స్ ఇస్తాడేమో. ఏది ఏమైనా ఇప్పటికే సుస్మిత తన నిర్మాణంలో వెబ్‌ సిరీస్‌ ప్లాన్ చేసుకుంది.

పైగా చిరంజీవి సతీమణి సురేఖ చేతుల మీదుగా ఆ వెబ్ సిరీస్ ను ఆల్ రెడీ స్టార్ట్ చేశారు కూడా. తమిళ దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో రానున్న ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఎలాగూ కథ బాగుంది కాబట్టి, కథ పై నమ్మకం ఉంచి సుస్మిత బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెడుతుంది. ఇక సుష్మిత చేస్తోన్న ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్‌ త్వరలోనే మళ్ళీ స్టార్ట్ కానుంది.

వచ్చే షెడ్యూల్ నుండి ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అలాగే సుస్మిత ప్రస్తుతం కొత్త కథలు వింటున్నారని, ఆమె ఆల్ రెడీ రెండు కథలను ఓకే చేసిందని మొత్తానికి కరోనా టైంలో కూడా సుస్మిత స్పీడ్ పెంచిందని తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....
Oktelugu Epaper
Exit mobile version