
‘మెగాస్టార్ రామ్ చరణ్’కి ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం కావడం లేదట. మరోపక్క చరణ్ కోసం ఎదురుచూస్తోన్న నిర్మాతలకు మాత్రం టెన్సన్ మొదలైంది. నిజానికి రాజమౌళితో సినిమా తరువాత చరణ్ కి పాన్ ఇండియా ఇమేజ్ వస్తోంది కాబట్టి, ఆ ఇమేజ్ ను నిలబెట్టే సినిమా చేయాలని దిల్ రాజు చాల ప్లాన్ చేశాడు. అందులో భాగంగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాని ఫిక్స్ చేశాడు.
అయితే శంకర్ డైరెక్షన్లో చరణ్ అని వార్త రాగానే అప్పటి నుండి ఈ సినిమాకి అన్ని అశుభాలే ఎదురవుతున్నాయి. మొత్తానికి చరణ్ తో శంకర్ సినిమా అనేది ఇప్పుడు డౌటులో పడిపోయింది. లైకా సంస్థతో శంకర్ లీగల్ చిక్కుల్లో దాదాపు ఇరుక్కున్నట్లే. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఏమి చెయ్యాలి ? ఎవరితో సినిమా చేయాలి ? అసలు శంకర్ లీగల్ సమస్య నుంచి బయటపడకపోతే,
చరణ్ కి ఏ స్టార్ డైరెక్టర్ ను సెట్ చేయాలి అని దిల్ రాజు ఆలోచనలో పడ్డాడు. మరోపక్క శంకర్ తో చేసే సినిమా చెయ్యడం ఆలస్యమైతే, మనం వేరే సినిమా చేద్దాం అంటూ నిర్మాత అశ్వినీదత్ ప్రపోజల్ పెట్టాడట. అశ్వినీదత్ దగ్గర తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డేట్స్ ఉన్నాయి. సో.. చరణ్ ఒప్పుకుంటే అట్లీతో మాట్లాడతాను అంటూ అశ్వినీదత్ అప్రోచ్ అయ్యాడట.
మెగా సన్నిహితులు కూడా చరణ్ వేరే సినిమా చూసుకోవడం బెటర్ అని చెబుతున్నారట. మరి ఇప్పుడు చరణ్ ఏమి చేస్తాడో చూడాలి.