
‘బాహుబలి’ పార్ట్స్ తో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ వచ్చింది. ఏ సౌత్ హీరోకు సాధ్యం కానిది, ప్రభాస్ ఒక్క సినిమాతోనే సాధించి పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ ఏకంగా ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.
హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో ప్రభాస్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమానికి క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడట. పైగా ప్రభాస్ ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. నిజంగానే ప్రభాస్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో ఒక హీరోగా నటిస్తే.. ఇక ప్రభాస్ ఇంటర్ నేషనల్ స్టార్ అయిపోయినట్టే.
అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కాగా ప్రభాస్ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర చేయడానికి ఇప్పటికే అంగీకరించాడని క్రిస్టోఫర్ మెక్ క్వారీ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకీ క్రిస్టోఫర్ మెక్ క్వారీ ప్రభాస్ ను ఎప్పుడు కలిశాడు అంటే… రాధేశ్యామ్ సినిమా కోసం గత ఏడాది ప్రభాస్ ఇటలీ వెళ్ళాడు.
ఇటలీ వెళ్లిన సమయంలోనే క్రిస్టోఫర్ మెక్ క్వారీ ప్రభాస్ ను కలిసి స్టోరీతో పాటు ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించిన సీన్స్ ను కూడా చెప్పాడట. కథతో పాటు తన క్యారెక్టర్ కూడా ప్రభాస్ కి బాగా నచ్చింది అట. అందుకే వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న రిలీజ్ కాబోతుంది.