
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన సోమవారం ఉదయం కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన కరోనా కారణంగా చనిపోవడం దురదృష్టకరం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా కారణంగా మృతి చెందగా, తాజాగా టీఎన్‌ఆర్ మృతి చెందారు. మొదట్లో వైద్యానికి కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.
సినీ జర్నలిస్ట్ గా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన ఎప్పుడు నటీనటుల నుండి విలువైన సమాచారాన్ని బయటకు తీస్తారని.. అందుకే ఆయన ఇంటర్వ్యూలో పాల్గొనడానికి ప్రముఖులు సైతం ఆసక్తి చూపించేవారు. ఆయన లేని లోటును ఎవ్వరూ తీర్చలేరని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున టీఎన్‌ఆర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.