Actor’s Wife Hot Comments: శృంగారం బంగారం కంటే విలువైనది. అందుకే అది నాలుగు గోడల మధ్యే జరిగితే దానికో విలువ. అంతే కాని నడిబజారులో వేలానికి పెట్టేది కాదు. నలుగురితో పంచుకునేది కాదని మన పూర్వీకుల నమ్మకం. అయితే వాత్సాయనుడు కామసూత్ర రచించినా దాన్ని కూడా మనం రహస్యంగానే చదువుకుంటాం. కానీ ఇటీవల కాలంలో శృంగారానికి అవధులు లేకుండా పోతోంది. విచ్చలవిడికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య సినీనటి ఖుష్బూ పెళ్లికి ముందు శృంగారం కరెక్టేనని చెప్పడం వివాదాస్పదమైంది.

సినీతారలు తమ అభిప్రాయాలు ఓపెన్ గా చెబుతుంటారు. ఇందులో భాగంగానే శృంగారంపై తమ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. రొమాంటిక్ లైఫ్ లో ఎన్నో అద్భుతాలు ఉంటాయని చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మలైకా అరోరా తనకు ఇష్టమైన శృంగార భంగిమ గురించి చెప్పి వార్తల్లో నిలవడం తెలిసిందే. అప్పట్లో అది సంచలనం కలిగించింది.
ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ సారి శిల్లాశెట్టి హోస్ట్ గా వ్యవహరించిన షేప్ ఆఫ్ యూ ప్రోగ్రామ్ కు అతిథిగా వెళ్లింది. అక్కడ ఆమెకు శృంగారానికి సంబంధించిన ప్రశ్న ఎదురు కావడంతో ఓపెన్ గా రియాక్ట్ అయింది. శృంగారమంటేనే వ్యాయామంతో సమానమని బాంబు పేల్చింది. శృంగారం వల్ల ఎక్కువ కేలరీల శక్తి ఖర్చవుతుందని తన మనసులోని మాట బయటపెట్టింది. దీంతో అందరు కంగుతిన్నారు.
Also Read: తెలుగులో బిగ్గెస్ట్ ఫట్లు.. రూ. 80 కోట్ల నష్టాల్లో ‘ఆచార్య’
కొన్ని నెలల క్రితం తాను క్యాన్సర్ కు గురయ్యానని అప్పుడు గుండు కొట్టించుకోవడంతో అద్దంలో తన ముఖం అచ్చం శృంగార కన్యలా కనిపించేదని చెప్పింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. తాహిరా వివరణకు నివ్వెరపోయారు. ఇలా శృంగారం గురించి బహిరంగంగా చర్చించడం ఓ వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఇద్దరి మధ్య నాలుగు గోడల్లో జరిగేది శృంగారం కానీ ఆరుబయట చేసేది వ్యభిచారమనే కామెంట్లు వచ్చాయి. ఇలా బహిరంగంగా మాట్లాడటంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
శృంగారంపై హీరోయిన్లు కూడా రకరకాల కామెంట్లు చేయడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం శృంగారం బజారులో దొరికే సరుకుగా మారిపోయింది. ఏదో కావాలంటే అడిగి తీసుకునే వస్తువుగానే చూస్తున్నారు. కానీ శృంగారం గురించి తెలిసిన వారు మాత్రం ఇలా చేయరనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి శృంగారమనే విషయం గుట్టుగా చేసుకునేదే అని తెలుసుకుంటే మంచిది.
Also Read: ‘సర్కారివారి పాట’ ట్రైలర్ లీక్.. మహేష్ కు గట్టి షాక్
[…] Marriage: ప్రతీ వ్యక్తికి జీవితంలో అతి ముఖ్యమైన పండుగ పెళ్లి. ఈ పెళ్లిని అంగరంగవైభవంగా జరుపుకోవాలని, అతిరథుల మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ పెళ్లి సెట్ కాగానే ఎన్నో టెన్షన్స్, తీరికలేని పనులు ఉంటాయి. ఈ టెన్షన్లో చేయాల్సిన పనులన్నీ మరిచిపోతూ ఉంటారు. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధుత్వం ఏర్పడుతున్నందున ఇరు కుటుంబాల్లో హడావుడి ఉంటుంది. వధూవరులిద్దరికి ఒకే రకమైన కార్యక్రమం కనుక ఇద్దరి ఇళ్లల్లోనూ సందడి ఉంటుంది. కానీ అప్పటి వరకు పుట్టినింట్లో మెలిగిన అమ్మాయి ఇప్పుడు మెట్టినింటి గడప తొక్కనుంది. ఈ క్రమంలో అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటున్నామన్న ఆనందంతో పాటు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నామన్న భయం ఉంటుంది. ఈ భయంలో తన పెళ్లిలో చేయాలనుకున్న పనులన్నింటినీ మరిచిపోతూంటారు. అయితే అలా మరిచిపోకుండా ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ ప్రకారం వస్తువులన్నీ సెట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అంటున్నారు. […]
[…] […]