https://oktelugu.com/

ఈరోజుతో ‘వకీల్ సాబ్’తో పవన్ బంధం ముగిసింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దనుకొని రాజకీయాల్లోకి వెళ్లి.. రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తీసిన మూవీ ‘వకీల్ సాబ్’. మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో పవన్ కళ్యాణ్ బంధం ఈరోజుతో తీరిపోయింది. అంటే ఆయన చేయాల్సిన పనులన్నీ ‘వకీల్ సాబ్ ’లో కంప్లీట్ అయిపోయాయి. ఇక కేవలం ప్రమోషన్ మాత్రమే మిగిలి ఉంది. తాజాగా ‘వకీల్ సాబ్’కు సంబంధించిన మొత్తం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2021 / 06:16 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దనుకొని రాజకీయాల్లోకి వెళ్లి.. రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తీసిన మూవీ ‘వకీల్ సాబ్’. మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో పవన్ కళ్యాణ్ బంధం ఈరోజుతో తీరిపోయింది. అంటే ఆయన చేయాల్సిన పనులన్నీ ‘వకీల్ సాబ్ ’లో కంప్లీట్ అయిపోయాయి. ఇక కేవలం ప్రమోషన్ మాత్రమే మిగిలి ఉంది.

    తాజాగా ‘వకీల్ సాబ్’కు సంబంధించిన మొత్తం పనిని ఈరోజు తో పవన్ పూర్తి చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా.. తాజాగా డబ్బింగ్ కూడా పవన్ పూర్తి చేశాడు. ఇక ప్రమోషన్లకు వస్తాడో రాడో తెలియదు కానీ.. వకీల్ సాబ్ మూవీ పని అయితే పవన్ పూర్తి చేసినట్టే లెక్క.

    ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 4 రోజుల్లో వకీల్ సాబ్ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట..డబ్బింగ్ పూర్తియిన సందర్భంగా పవన్ తో దిగిన ఫొటోలను యూనిట్ షేర్ చేసింది. మరోవైపు ట్రయిలర్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈనెల 29న వకీల్ సాబ్ ట్రైలర్ ను ఫుల్ రిలీజ్ చేయబోతున్నారు.

    దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కొత్తగా యాడ్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శృతి నటిస్తోందట.. మరి ఈ రిమేక్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.