
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన ప్రతీ అప్డేట్.. హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 15వ శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి చార్మినార్ ను కళ్లకు కట్టేందుకు ఇప్పటికే భారీ సెట్ ను నిర్మించారు. గండికోట సంస్థానానికి సంబంధించిన సెట్ కూడా నిర్మించారు.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. కాబట్టి.. ఛేజింగ్ లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరమల్లును పట్టుకునేందుకు రాజభటులు అశ్వాలతో దూసుకొస్తుంటే.. పవన్ సాగించే హార్స్ రైడింగ్ కు గూస్ బంస్ అవ్వడం ఖాయమట.

అయితే.. క్రేజీ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు పవర్ స్టార్. స్వతహాగానే మార్షల్ ఆర్ట్స్ లో పవన్ మాస్టర్ అన్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. చిత్రంలోనే తన స్టామినా ఏంటో చాటిచెప్పాడు. అలాంటి పవన్.. ఇప్పుడు వీరమల్లు కోసం ప్రత్యేకమైన స్టంట్స్ నేర్చుకుంటుండడం విశేషం.
ఇందుకు సంబంధించిన చిత్రాలు సెట్స్ నుంచి లీకయ్యాయి. పొడవాడి ఈటెతో పవన్ సాధన చేస్తున్న దృశ్యాలు కేక పెట్టిస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ టీషర్ట్, లోయర్ తో రియల్ వారియర్ గా కనిపిస్తున్నాడు పవన్. ఈ చిత్రాలు చూస్తుంటే.. వీరమల్లులో హైఓల్టేజ్ పవర్ జనరేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
దాదాపు 170 కోట్ల వ్యయంతో.. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మిస్తున్నారు మెగా ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
