సూపర్‌ స్టార్‌ కి పవర్ స్టార్ ప్రత్యేక విషెష్ !

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి మరి ప్రకటించింది. నిజానికి రజినీకాంత్ కి ఈ అవార్డు రావడం వెనుక బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శలు వస్తోన్న తరుణంలో.. ఇప్పుడు తమిళనాట రాజకీయంగా బీజేపీకి కలిసి వచ్చేలా ఉంది. దీనికితోడు రజినీకాంత్‌ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. ఇప్పుడు బీజేపీ మిత్ర పక్షం జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా […]

Written By: admin, Updated On : April 1, 2021 5:06 pm
Follow us on


సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి మరి ప్రకటించింది. నిజానికి రజినీకాంత్ కి ఈ అవార్డు రావడం వెనుక బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శలు వస్తోన్న తరుణంలో.. ఇప్పుడు తమిళనాట రాజకీయంగా బీజేపీకి కలిసి వచ్చేలా ఉంది. దీనికితోడు రజినీకాంత్‌ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. ఇప్పుడు బీజేపీ మిత్ర పక్షం జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా రజినికి తన విశేషమైన విషెష్ ను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను కూడా పెట్టారు.

కాగా పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌ లో ఏముంది అంటే.. ‘రజినీకాంత్‌ గారికి దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు దక్కడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయనకు నా తరపున జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తూ వస్తున్న రజినీకాంత్‌ గారు ఆ అవార్డుకు అన్ని విధాలుగా అర్హులు. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. కొన్నేళ్ల క్రితం అన్నయ్య చిరంజీవి గారితో ఆయన నటించిన సినిమాలు ఇంకా నాకు గుర్తే. రజినీగారు ఇంకా మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ రాసుకొచ్చాడు.

ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది దేశంలోనే ముఖ్యంగా సినీ రంగంలో అత్యున్నత పురస్కారం లాంటిది. ఎందరో సినీ దిగ్గజాలకు ఈ అవార్డ్ ను అందజేశారు. 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డును అందుకోవడం విశేషం. ఇక రజినీకాంత్ ఈ అవార్డుకు సంపూర్ణ అర్హుడు. తమిళ చిత్ర సీమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఆయన సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. త్వరలోనే కేంద్రం రజినీకి ఈ అవార్డును అందజేయనుంది.