spot_img
Homeఎంటర్టైన్మెంట్Most Loved Director: ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడే దర్శకుడు ఎవరో తెలుసా..?

Most Loved Director: ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడే దర్శకుడు ఎవరో తెలుసా..?

Most Loved Director: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందికి కొందరు నచ్చితే, మరి కొంతమందికి ఇంకొంతమంది దర్శకులు నచ్చుతారు. ముఖ్యంగా పాన్ ఇండియాను షేక్ చేసే దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. తన తర్వాత స్థానంలో సుకుమార్ ఉండడం విశేషం…తెలుగు సినిమా దర్శకుల వైపే ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… మన నుంచి వచ్చే సినిమాలతోనే వాళ్ళు పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ అవుతున్నారు… ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు రాజమౌళి చేసిన సినిమాలకు మాత్రమే వస్తుంది. కారణం ఏదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని రాజమౌళి తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్న దర్శకుడిగా ఒక వండర్ ను క్రియేట్ చేశాడు.

మొత్తానికైతే నార్త్ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు రాజమౌళి గురించి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. తను ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్నందుకు గర్విస్తున్నామంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మొత్తానికైతే రాజమౌళి ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లందరిలో ముందు వరుసలో దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళిని చూసి భయపడే రేంజ్ కి వెళ్ళిపోతాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది.

కారణమేంటంటే రాజమౌళి సినిమా సగటు ప్రేక్షకులందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి తను చేస్తున్న సినిమాలన్నింటితో మ్యాజిక్ చేస్తాడు. తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకోసమే అతనికి అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version