టీడీపీపై డీసీ ‘ఫూల్స్ డే’ కథనం..పెనుదుమారం

‘‘పోయి పోయి బకరా చేయడానికి టీడీపీనే దొరికిందా? చంద్రబాబు అంత లోకువుగా కనిపించాడా? 40 ఇయర్స్ బాబును సంతలో పశువులా కొనేశారని రాస్తారా? ఏం జర్నలిజం.. ఏం పాడు విలువలు? ఏందీ ఫూల్స్ డే స్టోరీ’’ అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు దక్కన్ క్రానికల్ పత్రికపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పత్రిక వండివార్చిన ‘ఫూల్స్ డే’ కథనం ఇప్పుడు టీడీపీ కొంప ముంచేలా తయారైంది. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న “డెక్కన్ క్రానికల్” ఇంగ్లీష్ దినపత్రిక ప్రతి సంవత్సరం ఏప్రిల్ […]

Written By: NARESH, Updated On : April 1, 2021 5:06 pm
Follow us on

‘‘పోయి పోయి బకరా చేయడానికి టీడీపీనే దొరికిందా? చంద్రబాబు అంత లోకువుగా కనిపించాడా? 40 ఇయర్స్ బాబును సంతలో పశువులా కొనేశారని రాస్తారా? ఏం జర్నలిజం.. ఏం పాడు విలువలు? ఏందీ ఫూల్స్ డే స్టోరీ’’ అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు దక్కన్ క్రానికల్ పత్రికపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పత్రిక వండివార్చిన ‘ఫూల్స్ డే’ కథనం ఇప్పుడు టీడీపీ కొంప ముంచేలా తయారైంది.

హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న “డెక్కన్ క్రానికల్” ఇంగ్లీష్ దినపత్రిక ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఆసక్తికరమైన కథనాన్ని వండి వార్చుతుంటుంది. ఏప్రిల్ 1న ‘ఆల్ ఫూల్స్ డే’ సందర్భంగా ఎవరో ఒకరిని బకరా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తన పత్రికలో ఒక నకిలీ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇస్తూ ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ పాఠకులను పిచ్చోళ్లను చేస్తుంది. ఇది ఆ పత్రిక ప్రతీసారి చేసే తంతునే.. అయితే ఈసారి పెద్ద బాంబే పేల్చింది.

ఏపీ రాజకీయాల్లో టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. చంద్రబాబు తన టిడిపిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారని డీసీ వార్తాపత్రిక ఒక బ్యానర్ కథనాన్ని ఈరోజు ప్రచురించింది. ఇప్పటికే చంద్రబాబు అయిష్టంగానే బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలో లాంఛనాలు పూర్తవుతాయని పేర్కొంది. బేరసారాల్లో భాగంగా టిడిపి చీఫ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి మోడీ మంత్రివర్గంలో కేంద్రమంత్రి అవుతారని తెలిపింది. టిడిపి నాయకులంతా చంద్రబాబు నిర్ణయానికి సై అన్నారని..పార్టీలో భవిష్యత్తు లేదని.. అందుకే బీజేపీలో చేరడమే మార్గం అన్నారని ఆ పత్రిక కథనంలో పేర్కొంది.

అయితే ఆ కంటిన్యూషన్ రెండో పేజీలో డీసీ పత్రిక ట్విస్ట్ ఇచ్చింది. కథనం చివరలో ఇది ‘ఏప్రిల్ ఫూల్ జోక్’ అని స్పష్టంగా చెప్పింది. వార్త చదివిన వారంతా తొలుత గుండెలు బాదుకొని ‘తమను పిచ్చోళ్లను చేయడానికి’ డీసీ ఇలా చేసిందా అని అందరూ తిట్టుకున్నారు.

అయితే వార్త కథనంతో టిడిపి నాయకులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఫూల్స్ డే కోసం తమ పార్టీ పరువు తీస్తారా? అని డీసీ పత్రికపై ఫైర్ అయ్యారు. టిడిపి ఏపీ అధ్యక్షుడు కె అచ్చన్నాయుడు దినపత్రికను తప్పుపట్టారు. ఇది చెడ్డ జర్నలిజం అని విమర్శించాడు. “సమాజానికి జవాబుదారీగా ఉన్న బాధ్యతాయుతమైన వార్తాపత్రికలు ఇటువంటి నకిలీ వార్తలతో ప్రజలను మోసం చేయలేవు. ఇది పాత్రికేయ విలువల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి టిడిపి పుట్టింది. డీసీ పత్రిక దాని చారిత్రక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి ”అని అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ కో-ఇన్ ఛార్జ్ సునీల్ దేయోధర్ ఈ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశాడు. ఇది ‘ఏప్రిల్ ఫూల్ జోక్ కాదా’ అని కౌంటర్ ఇచ్చాడు.

కానీ డీసీ పత్రికలో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏప్రిల్ 1న పేపర్ ఇటువంటి నకిలీ వార్తలను ప్రచురిస్తుంది. ఆనాటి చారిత్రక ప్రాముఖ్యతను బట్టి ఈ కథనం రాయడంలో తప్పులేదని ఆ పత్రిక సమర్థించుకుంది. కానీ టీడీపీ మాత్రం దీనిపై భగ్గుమంటోంది.