వకీల్ సాబ్ ప్రిరిలీజ్ వేడుక సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ‘పవన్ కళ్యాణ్ సీఎం సీఎం’ అంటూ ఫ్యాన్స్ నినాదాలతో హైదరాబాద్ లోని కళాభారతి మారుమోగింది. పవన్ ప్రసంగిస్తుండగా అభిమానులు ఈ నినాదాలు భారీగా చేశారు.
దీంతో పవన్ కళ్యాన్ దీనిపై స్పందించారు. సీఎం అవ్వాలని ఉంటే అవుతాం అని.. కోరుకుంటే అవదు అని.. అవ్వాల్సిన టైంలోనే అవుతాను అని సీఎం సీటుపై తనకూ ఆసక్తి ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా స్పష్టం చేశారు.
సమాజం కోసం.. దేశం కోసం పనిచేసుకుంటూ వెళ్లిపోతామని.. ఆ దారిలో ఉన్నత స్థానానికి చేరితే సరే.. మీ గుండెల్లో ఉన్న స్తానానికి మించినదేదీ నాకు లేదు అని స్పష్టం చేశారు.
మా అన్నయ్య చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన నేను జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతూ ఉంటానని పవన్ తెలిపారు. ఇక మా అన్నయ్య నాగబాబుతో నాకు చిన్నప్పుడు చాలా విషయాలపై గొడవలు జరిగేవని.. కొట్టడానికి కూడా వెళ్లేవాడిననిని పవన్ చెప్పుకొచ్చాడు.