అవినీతి చేయొద్దనే సినిమాలు చేస్తున్నా: పవన్

వకీల్ సాబ్ సినిమా ప్రిరిలీజ్ వేడుక సందర్భంగా తాను మళ్లీ ఎందుకు సినిమాలు చేయాల్సి వస్తుందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.అవినీతి చేయకుండా ఉండేందుకు నేను సినిమా చేస్తున్నానని.. నేను సినిమా చేస్తే ప్రత్యక్షంగా.. పరోక్షంగా వెయ్యి మంది బతుకుతారని.. పరోక్షంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు(జగన్).. పాల ఫ్యాక్టరీలు (చంద్రబాబు) పెట్టుకుంటే లేనిది నేను సినిమాలు చేస్తే తప్పు ఏంటి? అని పవన్ కళ్యాన్ ప్రశ్నించారు. […]

Written By: NARESH, Updated On : April 5, 2021 8:58 am
Follow us on

వకీల్ సాబ్ సినిమా ప్రిరిలీజ్ వేడుక సందర్భంగా తాను మళ్లీ ఎందుకు సినిమాలు చేయాల్సి వస్తుందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.అవినీతి చేయకుండా ఉండేందుకు నేను సినిమా చేస్తున్నానని.. నేను సినిమా చేస్తే ప్రత్యక్షంగా.. పరోక్షంగా వెయ్యి మంది బతుకుతారని.. పరోక్షంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని పవన్ చెప్పుకొచ్చారు.

మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు(జగన్).. పాల ఫ్యాక్టరీలు (చంద్రబాబు) పెట్టుకుంటే లేనిది నేను సినిమాలు చేస్తే తప్పు ఏంటి? అని పవన్ కళ్యాన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీలతో అవినీతి చేయకుండా ఉండాలనే సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ప్రజా సేవ కోసం ఖర్చు చేస్తున్నానని పవన్ క్లారిటీ ఇచ్చాడు.

కేవలం నేను డబ్బు సంపాదించడానికే సినిమాలు చేయడం లేదని.. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకూ సినిమాలు చేస్తానని.. నన్ను ప్రేమించే దర్శకులతోనే సినిమాలు చేస్తానని పవన్ క్లారిటీ ఇచ్చారు. అద్భుతమైన సక్సెస్ లో ఉన్న దర్శకుల కన్నా.. సినిమా పట్ల ప్రేమ, గౌరవం ఉన్న వారితోనే సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

అందరూ సినిమాల్లో ఐటెం సాంగ్ లు పెట్టమంటే నాకు నచ్చదని.. తాను దేశభక్తి లేదా జానపద పాటలు పెట్టడానికి ఇష్టపడుతానని పవన్ క్లారిటీ ఇచ్చారు. స్త్రీలను కించపరిచేలా సినిమా చేయలేనని.. ప్రతి ఆడపడుచుకూ గౌరవం ఈ సినిమా అన్నారు.

ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం రావడం నా అదృష్టం అని.. రాజకీయంగా నన్ను తిట్టినా మా దారులు వేరైనా సరే.. సినిమాకు వచ్చేసరికి మేమంతా ఒకటేనని ప్రకాష్ రాజ్ అప్పట్లో తిట్టిన వ్యాఖ్యలను పవన్ లైట్ తీసుకున్నారు. ప్రకాష్ లాంటి సవాల్ విసిరే నటుడు ఎదురుగా ఉన్నప్పుడే మనం ఇంకా బాగా నటించగలం అని చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడని.. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నానని పవన్ అన్నారు. ఏమాత్రం అండదండలు లేని సమూహం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మీ గుండెచప్పుడు నేను అర్థం చేసుకున్నవాడిని.. మీ గుండెల్లో ప్రేమను గౌరవించేవాడిని.. మీకోసం సినిమాల ద్వారా ఆనందాన్ని ఇవ్వాలని పరితపించేవాడిని.. ఫ్లాప్ అయినా కూడా ఎక్కువ సినిమాలు చేయాలని పవన్ అన్నారు.