
గతంలో పవన్ సినిమా రావాలంటే మినిమం సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. ఏడాదిపైన ఎంత కాలం పడుతున్నది తెలిసేది కాదు. కానీ.. రీ-ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్.. అందరితో వార్నాయనో అనిపించారు. ఇక, ఇప్పుడు లేటెస్ట్ బజ్ వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!
వకీల్ సాబ్ వారంలో వచ్చేస్తోంది. అటు వీరమల్లు, ఇటు ఏకే రీమేక్ శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఆ తర్వాత గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు ఏకంగా 15 సినిమాలకు స్కెచ్ గీసినట్టుగా ప్రచారం సాగుతోంది.
అయితే.. ఇవన్నీ పవన్ సొంత బ్యానర్లో కావడం విశేషం. ఇన్నాళ్లూ హీరోగానే టాప్ రేంజ్ లో వెలిగిపోయిన పవన్.. నిర్మాతగానూ రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్, నితిన్ తో ఛల్ మోహన రంగ వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు.. వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అయితే.. పవన్ ఒక్కడే కాకుండా నిర్మాత వివ్వప్రసాద్ తో కలిసి ఈ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమాలు చేస్తారని టాక్. మొత్తం పదిహేను సినిమాల్లో ఆరు చిన్నవి, ఆరు మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయట. మిగిలిన మూడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయని తెలుస్తోంది.
ఇందులో అగ్రహీరోలతో నిర్మించబోయే సినిమాలు కూడా ఉంటాయట. వీటిల్లో కొన్ని సినిమాల్లో పవన్ హీరోగా నటించనుండగా.. మరికొన్ని నిర్మాతగా ఉంటూ.. వేరే హీరోలతో చేస్తారని తెలుస్తోంది. పవన్ అంటే.. ఇండస్ట్రీలో అందరికీ గౌరవంతో కూడిన ఇష్టమే. కాబట్టి.. ఎలాంటి ప్రాజెక్టులు, ఎలాంటి కాంబోలు ప్రాణం పోసుకుంటాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్