https://oktelugu.com/

డిప్రెషన్ లో ఉన్న వారికీ హీరో మాట సాయం !

‘జాతిరత్నాలు’ సినిమాతో హీరో అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి, రియల్ లైఫ్ లో కూడా తాను హీరోనే అనిపించుకోవడానికి కాస్త వినూత్నంగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ కరోనా కష్ట కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో మునిగిపోయిన వారితో మనసు విప్పి మాట్లాడి.. వారికి భరోసాను ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. అభిమానులకు అండగా నిలిచే హీరోలను చూశాము, కానీ ప్రేక్షకులకు అండగా నిలబడే హీరో అంటూ నెటిజన్లు కూడా నవీన్ పోలిశెట్టి గురించి పాజిటివ్ గా […]

Written By:
  • admin
  • , Updated On : May 17, 2021 / 03:07 PM IST
    Follow us on


    ‘జాతిరత్నాలు’ సినిమాతో హీరో అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి, రియల్ లైఫ్ లో కూడా తాను హీరోనే అనిపించుకోవడానికి కాస్త వినూత్నంగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ కరోనా కష్ట కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో మునిగిపోయిన వారితో మనసు విప్పి మాట్లాడి.. వారికి భరోసాను ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో.

    అభిమానులకు అండగా నిలిచే హీరోలను చూశాము, కానీ ప్రేక్షకులకు అండగా నిలబడే హీరో అంటూ నెటిజన్లు కూడా నవీన్ పోలిశెట్టి గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేసున్నారు. మరి కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వాళ్ళు మళ్ళీ తేరుకోవడానికి పర్సనల్ గా వీడియో కాల్ చేసి మరీ నవీన్ పోలిశెట్టి దైర్యం చెబుతున్నాడు.

    అయితే, నవీన్ ఇలా చేయడానికి రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ముఖ్య కారణం అట. సాయి స్మరణ్ అని నవీన్ పోలిశెట్టికి అభిమాని. అతను ఇటీవల తన తండ్రి కోల్పోయాడు. కరోనాతో అతని తండ్రి కన్నుమూశారు. అయితే సాయి స్మరణ్ తల్లి, ఆ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అయితే ఆమెను డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి “జాతిరత్నాలు” సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్.

    ఆ సినిమా చూస్తూ ఆ తల్లి మనస్ఫూర్తిగా నవ్వింది. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సాయి స్మరణ్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చేసి నవీన్ పోలిశెట్టి అభిమానికి ఫోన్ చేసి, అతని మదర్ తో మాట్లాడిదైర్యం చెప్పాడు.