
రోజులు మారాయి అని పెద్దవాళ్లు అంటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది గానీ, ఆ మాటల్లో నిజం ఉందని నిరూపించాడు ఒక కుర్రహీరో. ఆ రోజుల్లో హీరోలు తమ ప్రమోషన్ ను కూడా ఒక పద్దతి ప్రకారం నమ్మేవిధంగా చేసుకునేవారు. కానీ ఇది డిజిటల్ జనరేషన్ కదా.. ఒక కుర్ర హీరో తన గురించి తానూ చేయించుకున్న ఒక ప్రమోషన్ ఆర్టికల్ మరీ కామెడీగా ఉంది. తనకు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నట్టు అతనికి అతనే ఈ మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ ను తన టీమ్ ద్వారా బయటకు వదిలాడు.
ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ చూసి నిర్మాతలు ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్రాడు హీరోగా చేసింది రెండు సినిమాలు.. అందులో మొదటి సినిమాకు నిర్మాతకు మిగిలింది ఏమి లేదు, ఇక రెండో సినిమాకి బాగానే డబ్బులు వచ్చాయి. కానీ ఆ సినిమాలో మరో ఇద్దరు ఫామ్ లో ఉన్న కమెడియన్స్ తో పాటు మంచి కామెడీ కంటెంట్ కూడా ఉంది, అందుకే ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇవేమి ఆలోచించని నవీన్ పోలిశెట్టి మాత్రం తనకు టాలీవుడ్ లో భారీ డిమాండ్ అంటూ తనను తానూ ప్రమోట్ చేసుకున్నాడు.
ఇంతవరకూ బాగానే ఉంది, చేసుకోవచ్చు. కానీ..సినిమాలో నవీన్ పోలిశెట్టి చూపించిన కంప్లీట్ యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంటూ మిగిలిన టీమ్ ను వదిలేయడం మంచి అనిపించుకోదు. అలాగే మరో లైన్.. కరోనా పాండమిక్ టైమ్ లో థియేటర్ల నుంచి దాదాపు రూ. 65 కోట్లు గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది జాతిరత్నాలు సినిమా. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సూపర్ హిట్ ను వన్ మ్యాన్ షోగా నడిపించిన హీరో నవీన్ పోలిశెట్టికి ఒక్కసారిగా టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. అంటూ నవీన్ గురించి ఓ రేంజ్ లో రాసుకొచ్చారు. అసలు ‘జాతి రత్నాలు’ సినిమా వన్ మ్యాన్ షో కాదు అని నవీన్ కి తెలియంది కాదు కదా !