Balakrishna : నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ, ఏది క్లారిటీ లేదు. అసలు బాలయ్య సినిమాలకు టైటిల్స్ పెట్టడం కొంచెం కష్టం. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న సినిమాకు కూడా, టైటిల్ పెట్టలేక మేకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపు రోజుకొక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘జై బాలయ్య ‘ అనే టైటిల్ నే బాలయ్య ఫైనల్ చేశాడట.

జై బాలయ్య అనే పదమే చాలా క్యాచీగా ఉంటుంది. పైగా బాలయ్య అభిమానులకు ఈ టైటిల్ బాగా ఇష్టమైనది. అందుకే ‘జై బాలయ్య’గానే ఫిక్స్ అయిపోయారు. నిజానికి గతంలోనే ఈ సినిమాకి ఇదే టైటిల్ అని వార్తలు వచ్చాయి. మొత్తానికి నట సింహం తన 107వ సినిమాకి ‘జై బాలయ్య’ అని ఫిక్స్ అయ్యింది. నిజానికి ఈ సినిమాల బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’, ఈ సినిమా టైటిల్ ను కూడా మొదట ‘వీరసింహారెడ్డి’గానే పెట్టాలని ఆలోచించారు. చివరకు జై బాలయ్యకే అందరూ ఓటు వేశారు.
ఇక ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట. ఇక బాలయ్యకి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతుంది.

ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తోంది. లావు పెరగడానికి తన డైట్ ను మార్చుకుంది. నిజానికి శృతి హాసన్ కి జీరో సైజ్ అంటేనే ఎక్కువ మక్కువ. కానీ బాలయ్య సినిమా కోసం పూర్తిగా వర్కౌట్స్ మానేసింది. బాలయ్య కోసం సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమెది ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్ర. ఆ పాత్రలో బాలయ్య భార్యగా శృతి హాసన్ నటించబోతుంది.
ఏది ఏమైనా అరవై ఏళ్ల వయసులో బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. పైగా చాలా విషయాల్లో బాలయ్య నిర్మాతలకు మంచి లాభదాయకం. రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదు. డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవు. ఏ రకంగా చూసుకున్న బాలయ్యతో సినిమా సేఫ్ ప్రాజెక్ట్.